కృష్ణ

‘ఒంగోలు జాతి’ని పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: భారతదేశం గర్వించదగ్గ ఒంగోలు జాతి పశుసంపద నానాటికీ అంతరించి పోతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతి పశువులను పరిరక్షించి వృద్ధి చేసేందుకు నడుం బిగించాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. స్థానిక లింగవరం రోడ్డులోని కే కనె్వన్షన్‌లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు మంగళవారం రాత్రి 11గంటలకు ముగిసాయి. ఐదు రోజులుగా రెండు పళ్ళు, నాలుగు పళ్ళు, ఆరు పళ్ళు, సేద్య విభాగం, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో దాదాపు 100 ఒంగోలు జాతి ఎడ్ల జతలు పోటీపడ్డాయి. ఈ పోటీలన్నింటినీ వీక్షించేందుకు సుమారు లక్ష మంది రైతులు నియోజకవర్గం, పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా నలుమూలల నుండి విచ్చేశారు. పోటీలను వీక్షించే రైతులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భారీ ఎత్తున బారిగేట్లు, గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పోటీలను స్థానిక ఛానల్స్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్ లింక్‌ల ద్వారా లైవ్‌లలో ప్రసారం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ గన్నవరం అసెంబ్లీ ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, ఎమ్మెల్యే సోదరుడు కొడాలి చిన్ని, ఎమ్మెల్యే నాని, సోదరుని కుటుంబ సభ్యులు పోటీల్లో పాల్గొనే రైతులకు మెమొంటోలను అందజేశారు. సబ్ జూనియర్స్ విభాగంలో కృష్ణాజిల్లా కానూరుకు చెందిన డీవీఆర్ మెమోరియల్ అధినేత సుబ్బారావు ఎడ్ల జత మొదటి స్థానంలో నిలిచింది. అలాగే కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన మేకా కృష్ణమోహన్ ఎడ్లజత 2వ స్థానంలో, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రమేష్ ఎడ్ల జత 3వ స్థానంలో, కృష్ణాజిల్లా నున్నకు చెందిన బొంతు రామిరెడ్డి, బొంతు జ్ఞాన భవ్య, నిరఘ్నశ్రీల ఎడ్ల జత 4వ స్థానంలో, గుంటూరు జిల్లా పినె్నల్లికి చెందిన నాగెళ్ళ రాకేష్‌చౌదరి, మోటుమర్రి జక్రయ్యల ఎడ్ల జత 5వ స్థానంలో, గుంటూరు జిల్లా వేమూరు మండలం వరాహపురానికి చెందిన మొవ్వా బసవేశ్వరరావు, మొవ్వా సుబ్బారావుల ఎడ్లజత 6వ స్థానంలో, కృష్ణాజిల్లా విజయవాడ నున్నకు చెందిన భీమవరపు చెన్నకేశవరెడ్డి, గుంటూరు జిల్లా క్రోసూరు మండలం తాళ్లూరుకు చెందిన లంకా ధీత్యాచౌదరిల ఎడ్ల జత 7వ స్థానంలో, గుంటూరు జిల్లా నవలూరుకు చెందిన బీఎన్‌ఆర్ నంది బ్రీడింగ్ అధినేత బత్తుల శ్రీనివాసరావుల ఎడ్ల జత 8వ స్థానంలో, కొల్లిపరకు చెందిన ఏ హేమారెడ్డి ఎడ్ల జత 9వ స్థానంలో నిలవగా విజేతలకు వరుసగా రూ.60వేలు, రూ.50వేలు, రూ.40వేలు, రూ.35వేలు, రూ.30వేలు, రూ.25వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేల నగదు బహుమతులను అందజేశారు. అలాగే జూనియర్స్ విభాగంలో కృష్ణాజిల్లా కానూరుకు చెందిన డీవీఆర్ మెమోరియల్ అధినేత దేవభక్తుని సుబ్బారావు ఎడ్ల జత మొదటి స్థానంలో, పెనమలూరుకు చెందిన కే వెంకట సుబ్బయ్య మెమోరియల్ అధినేత కొయ జగన్మోహనరావు ఎడ్ల జత 2వ స్థానంలో, గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలేనికి చెందిన యామిని మోహనశ్రీ ఎడ్ల జత 3వ స్థానంలో, తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ప్రగతి రిసార్ట్స్ అధినేత మేకా రామకృష్ణ ఎడ్ల జత 4వ స్థానంలో, హైదరాబాద్ షామీర్‌పేట్ మండలం తుర్మాపల్లికి చెందిన వనమాలి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ అధినేత రోహన్‌బాబు ఎడ్లజత 5వ స్థానంలో, గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన వీరవల్లి పూజిత చౌదరి ఎడ్ల జత 6వ స్థానంలో, ప్రొద్దుటూరుకు చెందిన కరీదు శ్రీనివాసరావు, కట్టుకోలు రవీంద్రరెడ్డిల ఎడ్లజత 7వ స్థానంలో నిలవగా విజేతలకు వరుసగా రూ.70వేలు, రూ.50వేలు, రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.10వేల నగదు బహుమతులను అందజేశారు. సీనియర్స్ విభాగంలో కృష్ణాజిల్లా గుణదలకు చెందిన ఇందిరా ఫుడ్స్ అధినేత మండవ వెంకటరత్నం ఎడ్ల జత మొదటి స్థానంలో, గన్నవరానికి చెందిన నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ కాసరనేని పావనాచౌదరి, గగనాచౌదరిల ఎడ్ల జత 2వ స్థానంలో, యనమలకుదురుకు చెందిన అనంతనేని శ్రీకావ్య, శ్రీమధు, పావనాచౌదరి, గగనాచౌదరి, బిళ్ళాలాపురం మండలం పోతురెడ్డిపల్లికి చెందిన నంది బ్రీడింగ్ రామలింగేశ్వర స్వామి ఎడ్ల జత 3వ స్థానంలో, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరుకు చెందిన టీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా అధినేత తోట శ్రీనివాసరావు ఎడ్ల జత 4వ స్థానంలో, కృష్ణాజిల్లా ఘంటసాలకు చెందిన గొర్రెపాటి నవనీత కృష్ణ ఎడ్ల జత 5వ స్థానంలో, గుంటూరు జిల్లా నవలూరుకు చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 6వ స్థానంలో, గుణదలకు చెందిన మండవ వెంకటరత్నం ఎడ్ల జత 7వ స్థానంలో, మొవ్వకు చెందిన తాతినేని పిచ్చేశ్వరరావు ఎడ్ల జత 8వ స్థానంలో, గుంటూరు జిల్లా కాకునూరు మండలం సీతారాంపురానికి చెందిన గొట్టుముక్కల రాంబాబు, సాయి బుల్స్ అధినేత దాసరి నారాయణరావుల ఎడ్ల జత 9వ స్థానంలో నిలవగా విజేతలకు వరుసగా రూ.లక్ష, రూ.80వేలు, రూ.70వేలు, రూ.60వేలు, రూ.50వేలు, రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేల నగదు బహుమతులను వైసీపీ సీనియర్ నాయకులు పాలడుగు రాంప్రసాద్, పాలేటి చంటి తదితరులు అందజేశారు.