కృష్ణ

నేడు నాణ్యమైన నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మానవ జీవితంలో కల్తీలేని ఆహారం సేవించుట ఎంతో ముఖ్యం. అందుకుగాను నగరంలోని అన్ని రకాల వ్యాపారస్తుల సారథ్యంలో నడిచే 65 ఏళ్ల చరిత్ర కలిగిన విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి పర్యవేక్షణలో స్వరాజ్య మైదానం రైతుబజారులోని 35, 36 నెంబర్ గల స్టాల్స్‌లో నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాన్ని గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ ప్రారంభించనున్నారు. కల్తీలేని నాణ్యమైన సరుకును సరఫరా చేయుటకు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల విజయవాడ పట్టణంలో తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను ప్రజలకు విక్రయించడం జరుగుతుందని ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని వారు కోరారు.

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సభ్యునిగా
డాక్టర్ రమేష్‌బాబు నియామకం

విజయవాడ, జనవరి 16: మూడు దశాబ్దాలుగా నగరంలో గుండె వైద్య సేవలందిస్తున్న రమేష్ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ పోతినేని రమేష్‌బాబు కార్డియాలజి విభాగంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సభ్యునిగా దక్షిణ భారతదేశం ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్‌బీఈ డైరెక్టర్ డాక్టర్ రప్మేకాంత్‌దర్ నుంచి ఈ మేరకు బుధవా రం నియమక పత్రం అందాయి. వైద్య విద్యార్థుల పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాలు, ప్రాక్టికల్స్ వంటి పలు అంశాలు బోర్డు సమీక్షిస్తుంటుంది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, ఎగ్జామినర్ ప్యానల్, ఇనె్వక్టర్ల నియామకం, వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాల్లో తీసుకునే ఈ బోర్డులో రమేష్‌బాబు సభ్యునిగా నియమితులయ్యారు. డిగ్రీ, పీజీ విద్యకు సమానంగా డిప్లమా ఆఫ్ నేషనల్ బోర్డ్ అందించే సర్ట్ఫికేట్‌లకే ఎక్కువ విలువ ఉందనే భావనతో రమేష్ బాబు పదేళ్లుగా సూపర్ స్పెషాల్టీ కోర్సులు కార్డియాలజీ, న్యూరాలజీలలో డీఎన్‌బీ వైద్య విద్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక గుంటూరు రమేష్ ఆసుపత్రిలో ఈ ఏడాది పీజీ, సూపర్ స్పెషాల్టీలలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, గైనకాలజీ, యూరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, అనస్తీషియా కోర్తులను అందించేందుకు దరఖాస్తు చేశారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ రమేష్‌బాబు తెలిపారు. ఏదిఏమైనా నవ్యాంధ్రప్రదేశ్‌లో తొరిసారిగా పీజీ, సూపర్ స్పెషాల్టీలలో అన్ని రకాల వైద్య కోర్సులను అందుబాటులోకి తెచ్చిన రమేష్‌బాబును ప్రతి ఒక్కరూ అభినందించారు.