కృష్ణ

రేపు పీఎంఏవై పక్కాగృహాల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం (ఎన్‌టీఆర్ నగర్) గృహ పథకంలో టిడ్కో ద్వారా పక్కాగృహాలు మంజూరు కాబడిన లబ్ధిదారులకు ఈనెల 18న గృహాల కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. మొత్తం 8,285 మందికి ఎలాట్‌మెంట్ లెటర్లు ఇవ్వడం జరిగిందని, వీరందరూ 18న నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఆన్‌లైన్ ద్వారా పక్కాగృహ కేటాయింపు చేస్తారన్నారు. దీనికి సంబంధించి తూర్పు నియోజకవర్గం పరిధిలో 4-12-2018, సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 10-12-20 18, పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 15-12-2018 తేదీ నాటికల్లా లబ్ధిదారు లు చెల్లించాల్సిన వాటా చెల్లించిన వా రు మాత్రమే ఈకార్యక్రమానికి హాజరుకావాలని తెలిపారు. ఇదిలావుండగా నగరంలో పక్కాగృహాల కోసం మొ త్తం 15వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11వేల 500 మంది వరకూ లబ్ధిదారుల వాటా కింద చెల్లించాల్సిన నగదు మొత్తాన్ని చెల్లించగా వీ రిలో ప్రస్తుతం 8,285 మందికి మాత్ర మే ఆన్‌లైన్ లాటరీ ద్వారా గృహాల కేటాయింపు జరుగుతుందని, మిగిలిన వారికి మలివిడతో గృహాల కేటాయిం పు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఎలాట్‌మెంట్ లెటర్లు తీసుకునే లబ్ధిదారులకు ఇప్పటికే వారి వారి ఫో న్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చామని, ఒకవేళ లాటరీ ప్రక్రియకు హాజరుకాలేని వారికి తమ కేటాయిం పు వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా స మాచారం తెలుపుతామన్నారు.

వక్ఫ్ భూములను పరిరక్షించాలి
ఇబ్రహీంపట్నం, జనవరి 16: రా ష్ట్రంలో వక్ఫ్‌బోర్డు భూములు ఎవరికి పడితే వారికి కేటాయిస్తున్నారని ము స్లిం పర్శనల్ లా బోర్డు ఆఫ్ ఇండి యా కార్యదర్శి రియాజుద్దీన్ పేర్కొన్నారు. మండలంలోని కొండపల్లి షాబుఖారి దర్గా ప్రాంగణంలో రాష్ట్ర ఆహ్లసున్నతుల్ జమాతే సమావేశం బుధవారం జరిగింది. రాష్ట్ర ముస్లిం పర్శనల్ బోర్డు ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అల్త్ఫా రజా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రియాజుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ముస్లింల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని కోరారు. వక్ఫ్‌బోర్డు భూములను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు కేటాయించటం వలన భూములు అన్యాక్రాంతమవుతున్నాయని వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుఫీ అజిమీర్ బాబా ముఫ్తీ అబ్దుల్ ఖాదర్, లీగల్ అడ్వైజర్ ముక్తార్ ఆలీ, న్యాయవాదులు జిలాని, జిన్నా, రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.