కృష్ణ

పేదల ప్రత్యక్ష దైవం ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, : పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇటు రాజకీయ సేవలు, అటు చలన చిత్ర రంగ సేవలు అందించిన ఎన్టీఆర్ పేదలకు ప్రత్యక్ష దైవమని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్వగ్రామమైన పామర్రు మండలం నిమ్మకూరులో శుక్రవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్, బసవరామతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు ముందు, ఎన్టీఆర్‌కు వెనుక అనే నూతన రాజకీయ శకాన్ని ప్రారంభించిన ఘనత ఆయనదేనన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాతే తెలుగు ప్రజల్లో చైతన్యం కలిగిందన్నారు. ఎన్టీఆర్ భారతదేశంలోని రాజకీయ నేతలకు, ప్రజలకు ఆదర్శప్రాయుడని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మెరుగులుదిద్ది చంద్రబాబు మరింత పటిష్టంగా అమలు జరుపుతున్నారని వివరించారు. నిమ్మకూరుతో పాటు పామర్రులోని ఎన్టీఆర్ విగ్రహానికి, కొమరవోలులోని ఎన్టీఆర్, బసవరామతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గొట్టిపాటి లక్ష్మీదాస్ తదితరులు నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌తోనే సంక్షేమానికి అంకురార్పణ

అవనిగడ్డ, : రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేసిన మహనీయుడు దివంగత ఎన్టీఆర్ అని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక గాంధీ క్షేత్రంలో శుక్రవారం ఎన్టీఆర్ 23వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి దిక్కు ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ఆయన చొరవతోనే వౌలిక సదుపాయాలకు కల్పించటం జరిగిందన్నారు. సామాజిక పెన్షన్‌దారులకు, డ్వాక్రా గ్రూపుల వారికి తీపి కబురు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత సమన్వయకర్తలకు, బూత్ స్థాయి కార్యకర్తలకు ఉందన్నారు. ఈ సందర్భంగా సాయి అనే కార్యకర్త తెలుగుదేశం పార్టీ యాప్‌ను వినియోగించే విధానంపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.