కృష్ణ

27న కొమరవోలుకు సీఎం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న తన తల్లి బసవరామ తారకం స్వగ్రామమైన పామర్రు మండలం కొమరవోలులో సుమారు రూ.10కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. సీఎం కార్యాలయ వర్తమానం మేరకు ఆయా అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. శనివారం కొమరవోలులో ఆయన పర్యటించి ప్రారంభానికి సిద్ధమవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. 54 ఇళ్లతో నిర్మితమైన పేదల కాలనీ, రూ.4.40 లక్షలతో నిర్మించిన అండర్ డ్రైనేజీ నిర్మాణం, రూ.8 లక్షలతో నిర్మించిన గ్రామ అంతర్గత రహదారి, రూ.25 లక్షలతో నిర్మించిన మహిళా సాధికారిత భవనం, రూ.15 లక్షలతో నిర్మించిన అధునాతన పంచాయతీ భవన నిర్మాణం, అంగన్‌వాడీ భవనం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామాభివృద్ధి కమిటీ కన్వీనర్ పొట్లూరి కృష్ణబాబు వివరాలు అందిస్తూ ఇప్పటికే గ్రామం ఉత్తమ పంచాయతీగా అవార్డు అందుకున్నదని, గుట్కా, మద్యపానం, బహిరంగ మల విసర్జన నిర్మూలనలో కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా అందుకుందని ఆయన వివరించారు. మోడల్ విలేజ్‌గా రాష్ట్రంలో కొమరవోలును నిలపాలనే ఉద్దేశంతో భువమేశ్వరి దత్తత తీసుకుని కృషి చేస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ, మచిలీపట్నం ఆర్డీఓలు సత్యవాణి, ఉదయభాస్కర్, గృహ నిర్మాణ, వ్యవసాయశాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.