కృష్ణ

శాఖమూరు పార్కులో అరుదైన వృక్షజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): రాజధాని అమరావతి నగరంలో ఏర్పాటు చేస్తున్న శాఖమూరు పార్కులో అరుదైన వృక్షజాలాలు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ డీ లక్ష్మీపార్థసారథి తెలిపారు. ఈమేరకు శనివారం ఉదయం ఏడీసీ అధికారులు, పీపీపీ ప్రాజెక్టు ప్రతినిధులతో కలిసి శాఖమూరు ఉద్యానవనంలో పర్యటించిన ఆమె పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఉద్యానవనంలో అరుదైన వృక్షాలను ఏర్పాటుచేయాలన్నారు. పార్కులో జరుగుతున్న పచ్చదనం అభివృద్ధి పనులపై పలు వివరాలు అడిగిన సందర్భంలో ఏడీసీ పట్టణ ప్రణాళిక విభాగాధిపతి పీ సురేష్‌బాబు వివరిస్తూ మరో నెల రోజుల్లో పార్కు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నదని తెలిపారు. అలాగే అడ్వంచర్ పార్కు, క్రాఫ్ట్‌బజార్, వెల్డర్‌నెస్ పార్కులో ఏర్పాటుచేస్తున్న పచ్చదనాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని సహాయ సంచాలకులు బీ శ్రీనివాసులును వివరించారు. అనంతరం క్రాఫ్ట్ బజార్‌లో జరుగుతున్న భవన నిర్మాణాలను పరిశీలించిన సీఎండీ ఆయా నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయాలని, పార్కులో సకల సదుపాయాలను కల్పించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎస్‌ఈ పీ అంకమ్మచౌదరిని ఆదేశించారు. అదేవిధంగా పార్కులో నిర్మిస్తున్న ఐదు అంతర్గత రహదార్లను బీటీ రహదార్లుగా నిర్మాణం చేపట్టాలని సీఈ టీ మోజెస్‌కుమార్‌కు సూచించారు.

52వ డివిజన్ వీధులకు పేర్లు ఖరారు
*ట్రాఫిక్ కమిటీ కీలక ఆమోదాలు
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 19: వీఎంసీ ట్రాఫిక్ అండ్ స్పోర్ట్స్ ప్రత్యేక కమిటీ సమావేశం 52వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరీపేట లోని పలు వీధులకు నామకరణాలను ఖరారు చేసింది. ప్రత్యేక కమిటీ చైర్మన్ చెన్నుపాటి గాంధీ అధ్యక్షతన శనివారం వీఎంసీ కౌన్సిల్ భవనంలోని స్టాండింగ్ కమిటీ సమావేశ మందిరంలో సమావేశమైన కమిటీ సభ్యులు 52వ డివిజన్ కార్పొరేటర్ ఎరుబోతు శ్రావణి ప్రతిపాదించిన సుమారు 20 వీధుల పేర్లలో కొన్నింటిని ఖరారు చేస్తూ, మరికొన్నింటిని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత రెండు దశాబ్దాల క్రితం ఆర్టీసీ బస్టాండ్ కాల్వ గట్టుతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో తొలగించిన వారిని తరలించి పునరావాసం కల్పించడంతో నూతనంగా ఏర్పడిన ఈ ప్రాంతంలో ఏ రహదారికీ ఎటువంటి పేరు లేకపోవడంతో స్థానికులు చిరునామా చెప్పడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలోని పలు రహదారులకు పేర్లను నిర్ణయించాలని కోరిన మీదట కమిటీ సభ్యులు చర్చానంతరం కార్పొరేటర్ సూచించిన పేర్లలో కొన్నింటిని ఆమోదించి మరికొన్ని తిరస్కరించారు. అలాగే మేయర్ కోనేరు శ్రీ్ధర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ డివిజన్ లోని తంగెళ్లమూడి వారి వీధి నుంచి ఆటోనగర్‌కు వెళ్లే రహదారికి మాజీ కార్పొరేటర్, మేయర్ సతీమణి కోనేరు రమాదేవి రహదారిగా నామకరణం చేసే అంశాన్ని ఆమోదించారు. మొత్తం 46 అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈసమావేశంలో కమిటీ సభ్యులు జీ హరిబాబు, యేదుపాటి రామయ్య, పిన్నంరాజు త్రిమూర్తిరాజు, సీటి ప్లానర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.