కృష్ణ

అక్విడెక్ట్‌ను పరిశీలించిన కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: న్యూఢిల్లీకి చెందిన సెంటర్ వాటర్ కమిషన్ బృందం శనివారం పులిగడ్డలోని అక్విడక్ట్, కృష్ణానది పరిసరాలను పరిశీలించింది. ఇదే కమిషన్ తుంగభద్ర బోర్డు, దవళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను పరిశీలించటంతో పాటు దివిసీమలో కృష్ణానది నైసర్గిక స్వరూపం, స్థితిగతులను అధ్యయనం చేశాయి. ఉప్పునీరు ప్రవాహం ఎగువకు వెళ్లటానికి గల కారణాలు, కృష్ణా కరకట్ట కోతకు గురవకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను పరిశీలించటం ద్వారా ప్రభుత్వానికి కమిషన్ నివేదిక అందించనుంది. కమిషన్ చీఫ్ ఇంజనీరు రవిశంకర్, నరసింహ నాయక్, హైడ్రాలిక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రమణ, డీఇఇ శ్రీనివాసరావు, సీఇ రంగారెడ్డి, రవిశంకర్ బృందంలో ఉన్నారు.