కృష్ణ

మార్చిలో పాముల్లంక హైలెవల్ బ్రిడ్జి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: తోట్లవల్లూరు- పాములలంక గ్రామానికి మధ్య కృష్ణానదిపాయలో రూ.30 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మార్చి మొదటి వారంలో పనులు చేపడతామని చీఫ్ ఇంజినీర్(పిఆర్) డి రవీంద్ర తెలిపారు. ఈఈ శ్రీనివాసులు, డీఈ బి రాంప్రసాద్, ఏఈ వెంకన్న, కాంట్రాక్టర్ వల్లభనేని వెంకటేశ్వరరావులతో కలిసి బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని మంగళవారం రవీంద్ర పరిశీలించారు. 360 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల వెడల్పుతో 21 ఖానాలు (పిల్లర్లు)తో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారని రవీంద్ర తెలిపారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 7.5 మీటర్ల వెడల్పుకి పెంచే అవకాశం ఉంటే పరిశీలన చేయమని ఈఈకి సూచించారు. నదీపాయలో పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన ఎర్రజెండాల పాయింట్లు, రైతుల నుంచి తీసుకునే భూములను పరిశీలించారు. కరకట్ట వైపున రైతు పట్ట్భామిలోకి బ్రిడ్జి నిర్మాణం వస్తుందని, రైతుకి పరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేయమని కలెక్టర్‌కి లేఖ రాశామని ఈఈ, డీఈ చెప్పారు. అలాగే ఫీల్డు సొసైటీలో కొందరి భూములు తీసుకుంటున్నామని, ఇవి ప్రభుత్వ భూములైనందున ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. నిర్మాణ పనులు మొదలు పెడితే భూమిని కోల్పోయో వారికి తమ సొసైటీలో భూములు ఇస్తామని, లేదా వారి సొసైటీలోనే ఉన్న ఖాళీ భూములు కేటాయించవచ్చని మాజీ సర్పంచ్ పాముల శ్రీనివాసరావు చీఫ్ ఇంజనీర్‌కి చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్ళ కాలపరిమితి ఉందని, అయితే నిధులు సకాలంలో విడుదల చేస్తే ఏడాది లోపే నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వల్లభనేని కనస్ట్రక్షన్స్ ఎండి వల్లభనేని వెంకటేశ్వరరావు చీఫ్ ఇంజినీర్ రవీంద్రకు హామీ ఇచ్చారు. శంకుస్థాపన ఎప్పుడు చేస్తారని అడగ్గా ఇప్పటికే టెక్నికల్ పనులు మొదలు పెట్టేసినట్టే అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా బ్రిడ్జి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదని తెలిపారు.