కృష్ణ

రోల్డ్‌గోల్డ్ పరిశ్రమకు బ్రాండ్ ఇమేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన రోల్డు గోల్డ్ పరిశ్రమకు బ్రాండ్ ఇమేజ్ కల్పించి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక పోతేపల్లి జ్యుయలరీ పార్కులో రూ.1.15 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షలతో కమ్యూనిటీ హాలు, రూ.30 లక్షలతో మార్కెటింగ్ సెంటర్, రూ.30 లక్షలతో రిసోర్స్ సెంటర్ భవనాలు, రూ.15 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మాజీ ఎంపి చిరంజీవి అందించిన రూ.5 కోట్లు నిధుల్లో రూ.3 కోట్లు పోతేపల్లిలోనే వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, శ్మశాన వాటిక అభివృద్ధి, డ్రైనేజీ అభివృద్ధితో పాటు జ్యుయలరీ పార్కులో నైపుణ్య శిక్షణా కేంద్రం, ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. పోర్టు పనుల ప్రారంభానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రోల్డుగోల్డ్ పరిశ్రమ అభివృద్ధి, ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి విద్యుత్ రాయితీ మంజూరుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే జ్యుయలరీ పార్కులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపి కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన రోల్డ్‌గోల్డ్ పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతంలో వేలాది మందికి స్వయం ఉపాధి కల్పించగా, కొంత మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి దోహదం చేసిందన్నారు. ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ స్థానిక పరిశ్రమలు అభివృద్ధితోనే జీవనోపాధి సాధ్యమన్నారు. జ్యుయలరీ పార్కు గౌరవ అధ్యక్షుడు చలమలశెట్టి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ పాల్గొన్నారు.