కృష్ణ

ఊపిరిపీల్చుకున్న తీరప్రాంత వాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, మే 20: రోను తుఫాన్ ప్రభావం తగ్గటంతో తీరప్రాంత వాసులు ఊపిరిపీల్చుకున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలో మంచినీటి ఎద్దడి కొద్దిమేర తీరింది. చెరువులు, గుంటలు, కాలువలు నీటితో నిండాయి. రోను తుఫాన్ కారణంగా వర్లగొందితిప్పి, చిన్నగొల్లపాలెంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శుక్రవారం ఆకాశం మేఘావృతమై వర్షం పడకపోవటంతో ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభించారు. గత రెండు రోజులుగా ఈదురు గాలులు వీయటంతో పడిపోయిన చెట్లను తీసివేశారు. పడిపోయిన విద్యుత్ స్థంబాలను పునరుద్దరించారు.