కృష్ణ

భవిష్యత్తు తరాలకు బంగారు బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు ఓడరేవు నిర్మాణం భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేయనున్నదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జనవరి మాసాంతం, ఫిబ్రవరి మొదటి వారంలో పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తుండటంతో ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్‌తో కలిసి బుధవారం ప్రారంభోత్సవ స్థల పరిశీలన చేశారు. మేకావానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల్లో పర్యటించి సీఎం బహిరంగ సభకు అనువైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మేకావానిపాలెంలో రెండు ఎకరాల్లో శాశ్వత పైలాన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 30 లేదా ఫిబ్రవరి 7వ తేదీ నాటికి మిషనరీ తీసుకు వచ్చి సీఎం చేతుల మీదుగా డ్రజ్జింగ్ పనులు ప్రారంభిస్తామన్నారు. పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు అన్ని విధాలా లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. భూమి కొనుగోలు పథకం కింద ఎవ్వరూ ఊహించని రీతిలో ఎకరానికి రూ.25లక్షలు పరిహారంగా చెల్లిస్తున్నామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో పట్టా భూముల సేకరణకు ఎకరానికి రూ.40లక్షలు చెల్లించడం జరుగుతుందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడ వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు తదితరులు పాల్గొన్నారు.