కృష్ణ

టీడీపీకి అధికారంతోనే బీసీలకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాజకీయంగా బీసీలకు తగిన గుర్తింపు లభించిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు(బుల్లయ్య) అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జయహో బీసీ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుండి బీసీ వర్గాలు రాజ్యాంగ పదవులను పొందుతున్నాయన్నారు. ఎన్టీ ఆర్ వారసుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు అండగా ఉంటున్నారన్నారు. బీసీలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టీడీపీ ప్రభుత్వమే స్పందిస్తూ వస్తోందన్నారు. బీసీ వర్గాల అండతో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.1500కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహ నిర్మాణానికి మాత్రం రూ.3వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఆదరణ పథకం ద్వారా చంద్రబాబు బీసీలను ఆదుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా చంద్రబాబుకు అండగా నిలిచి తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని కొనకళ్ళ బుల్లయ్య పిలుపునిచ్చారు. ముందుగా జ్యోతీరావుపూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా చంటి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అరికేపూడి రామశాస్త్రులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ గోర్జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.