కృష్ణ

జిల్లా కేంద్రానికి ప్రాధాన్యత దక్కేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గతమెంతో ఘన చరిత్ర కలిగిన జిల్లా కేంద్రం మచిలీపట్నంకు ఇప్పటికైనా ప్రాధాన్యత దక్కేనా..? అని ఈ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. మచిలీపట్నం జిల్లా కేంద్రమైనప్పటికీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో ప్రాధాన్యత లభించలేదు. జిల్లా కేంద్రంగా సాగాల్సిన పాలనా వ్యవహారాలు విజయవాడ కేంద్రంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్లుగా పని చేసిన వారంతా జిల్లా కేంద్రానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి ఉంది. ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రం కొద్దీ గొప్ప ప్రాధాన్యత ఇచ్చినా పాలనా కేంద్రంగా మచిలీపట్నం గుర్తింపుకు నోచుకోవడం లేదు. కలెక్టర్‌గా ఇక్కడ బాధ్యతలు స్వీకరిస్తున్నారే గానీ ఆ తర్వాత వారి కార్యకలాపాలన్నీ విజయవాడ కేంద్రంగా కొనసాగిస్తూ వస్తున్నారు. గత మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌గా ఎఎండీ ఇంతియాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన కూడా బాధ్యతల స్వీకరణకే పరిమితమయ్యారు. ఈ నెల 8వతేదీన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇంతియాజ్ బాధ్యతల స్వీకరించిన కొద్ది గంటలకే విజయవాడకు వెళ్లిపోయారు. బాధ్యతల స్వీకరించిన మరుసటి రోజు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారుల సమావేశం నిర్వహించడం విశేషం. కలెక్టర్‌గా వచ్చిన వెంటనే ఆయన సీఎం చేతుల మీదుగా జరగనున్న లక్ష పట్టాల పంపిణీ కార్యక్రమం, ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన, 11, 12తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటనపై దృష్టి సారించారు. దీంతో ఆయన జిల్లా కేంద్రానికి రాలేకపోయారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇంతియాజ్ అయినా జిల్లా కేంద్రానికి గుర్తింపు ఇస్తారా అని సంశయం ఈ ప్రాంత వాసుల్లో నెలకొంది. ప్రోటోకాల్ విధుల పేరుతో జిల్లా అధికార యంత్రాంగం అంతా గత కొంత కాలంగా విజయవాడకే పరిమితమవుతోందన్న విమర్శలు లేకపోలేదు. ఆయా శాఖలకు జిల్లా కేంద్రంలో సొంత కార్యాలయాలు ఉన్నప్పటికీ శాఖాధిపతులు క్యాంప్ కార్యాలయాల వేదికగానే కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారానికి ఒకటి లేదా రెండు రోజులు కూడా జిల్లా కేంద్రంలో ఉండని పరిస్థితి ఇప్పటి వరకు నెలకొంది. దీంతో జిల్లా కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు నిరాశగా వెనుతిరగక తప్పడం లేదు. మరీ కొత్త కలెక్టర్ ఈ సమస్యలను అధిగమించి జిల్లా కేంద్రం మచిలీపట్నంకు పాలనాపరంగా గుర్తింపు తీసుకువస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే.