కృష్ణ

పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే తన ముందున్న తొలి లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఆయన త్వరలో జరగనున్న ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పక్కా ప్రణాళికతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మచిలీపట్నం వచ్చిన ఆయన తన ఛాంబర్‌లో ఆంధ్రభూమి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణాజిల్లాలో ఎన్నికలు నిర్వహించే అదృష్టం తనకు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన ఎన్నికలన్నీ ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. రానున్న ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతాయని, అందుకు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు సహకారం అందించాలని కోరారు. ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారీపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పోలింగ్ రోజున ఓటరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 33లక్షల మంది పైబడి ఓటర్లు జిల్లాలో ఉన్నారు. సమస్య ఎక్కడైనా ఉండవచ్చని, దాన్ని పరిష్కరించడమే తమ బాధ్యత అన్నారు. ఇందుకు గాను 1950 కాల్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రతి ఓటరు తమ ఓటు వివరాలు తెలుసుకోవటంతో పాటు సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలియజేయవచ్చని తెలిపారు. అలాగే ఈవీఎం, వివి ప్యాడ్‌లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 3వేల 968 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు, రాజకీయ పక్షాలకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మాక్ పోల్ కూడా నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేస్తున్నామన్నారు. ఆ దిశగా జిల్లా అంతటా ఓటర్లకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ అంతా జిల్లా కేంద్రం ద్వారానే సాగుతుందన్నారు. ఒక పక్క ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కూడా దృష్టి సారిస్తామన్నారు. ప్రజల కనీస అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు.