కృష్ణ

పనుల ప్రారంభానికి పోటాపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, : నూజివీడులో పొలిటికల్ వార్ ప్రారంభమైంది. ఒకే పనులను రెండు పర్యాయాలు అధికారికంగా ప్రారంభించిన ఘనత నూజివీడు నేతలకే దక్కింది. ఒకే పనిని రెండుసార్లు ప్రారంభించటం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గురువారం ప్రారంభించగా, ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు పురపాలక సంఘానికి వౌలిక వసతుల అభివృద్ధి పథకం (సీఐఐపీ) కింద 33.30 కోట్ల రూపాయలు మంజూరైనాయి. దీనికి సంబంధించిన పనులను నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకటప్రతాప్ అప్పారావుతో గురువారం ప్రారంభించేందుకు పురపాలక సంఘం అధికారులు రంగం సిద్ధం చేశారు. మైలవరం రహదారిలోని శ్రీ రామమందిరం వద్ద శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనులు వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ప్రారంభిస్తే క్రెడిట్ అంతా ప్రతాప్ అప్పారావు ఖాతాలోకి వెళుతుందని భావించిన టీడీపీ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులతో బ్రేక్ వేయించారు. శుక్రవారం ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు(బాబు)తో పనులు ప్రారంభోత్సవం చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తనకు వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోకుండా గురువారంనాడు సంబంధిత పనులను ప్రజా ప్రతినిధులతో కలిసి యధావిధిగా ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు శుక్రవారం పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే టీడీపీ నాయకులు శిలాఫలకంతో పాటు వేదికను ఎమ్మార్ అప్పారావు కాలనీలో ఏర్పాటు చేశారు. ఎంపీ మాగంటి బాబు శిలాఫలకాన్ని ప్రారంభించి, పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపి మాగంటి వెంట మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ఎఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు, పురపాలక సంఘం కమీషనర్ వాసుబాబు, పురపాలక సంఘం ప్రతిపక్ష నాయకులు చెరుకూరి దుర్గాప్రసాద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ అధికారులు పురోగతి సాధించాలి

మచిలీపట్నం, ఫిబ్రవరి 15: జిల్లాలో ఇంజనీరింగ్ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జిల్లాలో 466 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం లక్ష్యం కాగా 576 కిలో మీటర్ల నిర్మాణాలు జరిగినట్లు తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. 255 అంగన్‌వాడీ భవన నిర్మాణ లక్ష్యానికి 68 పూర్తి చేశారన్నారు. 100 గ్రామ పంచాయతీ భవన నిర్మాణ లక్ష్యానికి 58 పూర్తయినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో సంతల ఏర్పాటులో భాగంగా ఒక్కొక్కటి రూ.9లక్షలతో 27 మంజూరు చేయగా ఆరు మాత్రమే పూర్తయ్యాయని మిగిలినవి కూడా ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు రూ.100కోట్లు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని పంచాయతీ రాజ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా 14 పథకాలకు సంబంధించి రూ.500కోట్లతో 146 పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఇ శ్రీనివాస మూర్తి, పంచాయతీ రాజ్ ఎస్‌ఇ రఘుబాబు, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుయస్, పబ్లిక్ హెల్త్, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు.