కృష్ణ

సంక్షేమ శాఖల ప్రగతి కొనసాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించేందుకు అధికారులు మరింత కష్టపడి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశమైన ఆయన ఆయా శాఖల ప్రగతిని నివేదికలను సమీక్షించారు. ప్రాథమిక రంగంలో జిల్లా గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోందన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతు సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇప్పటికే వివిధ పారా మీటర్స్‌లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. రానున్న రెండు మూడు నెలలు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం అవుతున్నప్పటికీ సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించడంలో ముందంజలో ఉండాలన్నారు. ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికల కోడ్ మధ్య వ్యత్యాసం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అన్నది పరిమితమైనదన్నారు. సాధారణ ఎన్నికల కోడ్ విస్తృతమైనదన్నారు. కోడ్ అమలులో ఉన్నప్పుడు అధికారులు పథకాల అమలుకు ఏవైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకు వచ్చి స్పష్టత తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ జెడీ మోహనరావు మాట్లాడుతూ ఈ-పంట కింద 2.05లక్షల హెక్టార్లలో నూరు శాతం లక్ష్యాలు సాధించామన్నారు. 99 శాతం క్రాప్ కవరేజ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. రైతులకు భూసార పరీక్షా కార్డులను నూరు శాతం పంపిణీ చేశామన్నారు. పెథాయ్ తుఫాన్‌కు పంట నష్టం రూ.16కోట్లు ఇన్‌పుడ్ సబ్సిడీ ప్రతిపాదనలు పంపామన్నారు. ఖరీఫ్‌లో జగ్గయ్యపేట, గంపలగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలు కరువు మండలాలుగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. సమావేశంలో మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, పశు సంవర్ధక శాఖ జెడీ భరత్ రమేష్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఎడీలు పాల్గొన్నారు.

ఉగ్రవాదుల దాడి గర్హనీయం

మచిలీపట్నం (కల్చరల్), : ఉగ్రవాదుల దాడిలో వీర మరణం చెందిన 44 మంది భారత జవాన్లకు నివాళులర్పిస్తూ బీజేపీ, సామాజిక సమరసత వేదిక, విశ్వ హిందూ పరిషత్, ఎబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. బాలాజీ విద్యాలయం నుండి కోనేరుసెంటరు వరకు విద్యార్థినీ విద్యార్థులతో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో కొమరగిరి చంద్రశేఖర్, పంతం వెంకట గజేంద్రరావు, కూనపరెడ్డి శ్రీనివాసరావు, సిహెచ్ సూర్యప్రకాశరావు, డా. సారంగపాణి, సింగరాజు గోవర్ధన్, ధూళిపాళ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నేడు డివిజన్ కేంద్రాల్లో
మాక్ పోల్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 15: త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శనివారం జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మాక్ పోల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బందరు డివిజన్‌కు, విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ఆయా డివిజన్‌లకు, గుడివాడ ఎన్‌జీఓ హోమ్‌లో గుడివాడ డివిజన్‌లకు సంబంధించి మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు.

ఇవిఎం, వివి ప్యాడ్స్‌పై
పూర్తి స్థాయి అవగాహన

మాస్టర్ ట్రైనర్స్ శిక్షణలో కలెక్టర్ ఇంతియాజ్

మచిలీపట్నం, : ఎన్నికల నిర్వహణలో ఈవిఎంలు, వివి ప్యాడ్స్ యూనిట్స్ వినియోగంపై మాస్టర్ ట్రైనర్స్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లాతో కలిసి ఎన్నికల రోజున మూడు రకాల యూనిట్స్‌ను ఉపయోగించే విధానం పట్ల ప్రత్యేక అవగాహన కార్యమ్రాన్ని కలెక్టర్ నిర్వహించారు. యూనిట్స్‌లో ఉండే బటన్స్ ఏ సమయంలో ఏ విధంగా ఉపయోగించాలో ఎన్నికల సిబ్బందికి తెలిసి ఉండాలన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ అనంతరం క్లోజ్ బటన్ ఉపయోగించకపోవటం వంటి అంశాల వల్ల సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలిపారు. అదే విధంగా ఉదయం నిర్వహించే మాక్ పోలింగ్ అనంతరం క్లియర్ బటన్‌ను ఉపయోగించి ఇవిఎంలు జీరో ఉండే విధంగా ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మాస్టర్ ట్రైనర్స్ పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కేవలం చిప్ ఆధారంగా ఈ యూనిట్లు పని చేస్తాయని, ఎటువంటి సాఫ్ట్‌వేర్ గానీ, ఇంటర్ నెట్ కనక్షన్‌లు అవసరం లేకుండానే స్వతంత్రంగానే ఇవిఎంలు పని చేస్తాయని కలెక్టర్ తెలిపారు. కంట్రోల్, బ్యాలెట్, వివి ప్యాడ్స్ వినియోగంపై సాంకేతిక నిపుణుడైన కార్తీక్ మాస్టర్ ట్రైనర్స్‌కు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.