కృష్ణ

ఆదాయం పెంపులో ఆక్వాదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు: రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆక్వా రంగానిదే ప్రముఖ పాత్ర అని ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) అన్నారు. ఆక్వాటెక్ మాస పత్రిక ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏలూరు రోడ్డులోని సీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో 17వ ఆక్వాటెక్ ఎక్స్‌పో నిర్వహించారు. రాష్ట్రంతో పాటు చెన్నై, బీహార్, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వివిధ కంపెనీలకు చెందిన ఆక్వా సంబంధిత పరికరాలను ప్రదర్శించారు. సుమారు 30 షాపుల వరకు ఏర్పాటు చేశారు. రైతులు భారీ ఎత్తున హాజరై ఎగ్జిబిషన్‌ను సందర్శించి వివిధ కంపెనీలకు ఆడ్డర్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి మాట్లాడుతూ భారత దేశంలో ఆక్వా రంగం ఎంతో ప్రసిద్ది చెందిందన్నారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతమైన కైకలూరు, కలిదిండి, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో ఆక్వా సాగు పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. తలసరి ఆదాయంలో కలిదిండి, కైకలూరు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయంటే ఈ ప్రాంతానికే గర్వకారణం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆక్వా రంగానికి పెద్దపీఠ వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, ఎఎంసీ చైర్మన్ తలారి వెంకట స్వామి, జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, చేపల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, మాజీ జెడ్పీటీసీ చింతపల్లి అంకినీడు, సయ్యపురాజు గుర్రాజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 245వ శ్రీకృష్ణ దేవరాయ జయంతి వేడుకలు

మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 16: స్థానిక బుట్టాయిపేట బ్రహ్మ సమాజ మందిరంలో బ్రహ్మ సమాజం, వైజ్‌మెన్ క్లబ్ ఆధ్వర్యంలో 245వ శ్రీకృష్ణ దేవరాయ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మ సమాజం అధ్యక్షుడు కూరాళ్ల రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందూ కళాశాల చరిత్ర శాఖాధిపతి సవరం వెంకటేశ్వరరావు శ్రీకృష్ణ దేవరాయులు ప్రజలకు చేసిన సేవలను కళ్లకు కట్టినట్లు వినిపించారు.

ముష్కరుల దాడులపై విద్యార్థి లోకం ఆగ్రహం

మైలవరం, ఫిబ్రవరి 16: కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారత జవాన్లపై తీవ్రవాదులు దాడి చేసి 42 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటనను తీవ్రంగా నిరశిస్తూ శనివారం మైలవరంలో విద్యార్థి లోకం నినదించింది. మైలవరంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు అప్సా ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌నుండి ర్యాలీగా మైలవరం పుర వీధులలో తిరిగి స్థానిక బోసుబొమ్మ సెంటరులో మానవహారంగా ఏర్పడి అమరవీరులైన సైన్యానికి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిముషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సంఘటనకు బాధ్యులైన ముష్కరులను వెంటనే శిక్షించాలన్నారు. అసువులు బాసిన వీర జవాన్లకు జోహార్లర్పించారు. కార్యక్రమంలో శ్రీ షిరిడీ సాయి బాబా భక్త సమాజం కోఆర్డినేటర్ వి బాలాజీ ప్రసాద్, ఎస్‌ఐ ఈశ్వరరావు, పలు పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, మదర్ ధెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోయ సుధ, పురు ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.
జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌నుండి ప్రారంభమైన ఈప్రదర్శన మైలవరం పుర వీధులలో తిరిగి స్థానిక బోసుబొమ్మ సెంటరులో మానవహారం నిర్వహించారు. విధి నిర్వహణలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు.