కృష్ణ

ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : వచ్చే ఎన్నికల్లో వినియోగించనున్న ఇవిఎంలు, వివి ప్యాట్లపై రాజకీయ పక్షాలు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని బందరు ఆర్డీవో జె ఉదయభాస్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇవిఎంలు, వివి ప్యాట్స్ పని తీరుపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు అవగాహన శనివారం కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు వస్తున్నందున పోలింగ్‌కు వినియోగించే ఇవిఎంలు, వివి ప్యాట్ ద్వారా ఓట్లు నమోదు పట్ల అవగాహన కల్పించేందుకు, ఎలాంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా ఎలాంటి పొరపాట్లు జరగని విధంగా ఎవరికి ఓట్లు వేస్తారో వారికే ఓటు నమోదవుతుందని తెలియచేసేందుకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవిఎంలు, వివి ప్యాట్ల విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకోవాలని పోలింగ్ ఏజెంట్లకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. మన దేశంలో ఎంతో వ్యయంతో కూడుకున్న ఇవిఎంలతో పోలింగ్ నిర్వహించడం ప్రజలకు భారం కాదా అని సీపీఎం ప్రతినిధి కొడాలి శర్మ ప్రశ్నించారు. పోలింగ్ మధ్యలో సాంకేతిక సమస్యలతో ఇవిఎం మిషన్లు ఆగిపోతే అప్పటి వరకు వేసిన ఓట్ల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ ప్రతినిధి కోకా ఫణిభూషణ్ సందేహం వెలిబుచ్చగా సమస్య ఏర్పడిన మిషన్‌ను రిప్లేస్ చేసి వేరే మిషన్ ద్వారా పోలింగ్ కొనసాగిస్తారని ఇందు కోసం ప్రతి రూట్‌కి అదనపు ఇవిఎంలు సిద్ధంగా ఉంచుతారని ఆర్డీఓ సమాధానమిచ్చారు. ఓటు తప్పు నమోదు అయిన సందర్భాలు ఉన్నాయా, ఇవిఎంల ద్వారా ఓటింగ్ అంశాలపై కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని బీఎస్పీ ప్రతినిధి గడ్డం రాజు సూచించారు. తొలుత ఘంటసాల తహశీల్దార్ వి సీత ట్రైనర్‌గా ఇవిఎం, వివి ప్యాట్ల పనితీరును సమగ్రంగా వివరించారు. సమావేశంలో ప్రభుత్వ మాజీ విప్, వైసీపీ నేత పేర్ని వెంకట్రామయ్య (నాని), టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, సీపీఐ ప్రతినిధి జె వెంకటేశ్వరరావు, బీజెపీ ప్రతినిధి పివి గజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

డీపీఓగా రవీందర్ బాధ్యతల స్వీకరణ

మచిలీపట్నం, ఫిబ్రవరి 16: జిల్లా పంచాయతీ అధికారిగా గంధం రవీందర్ శనివారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీపీఓగా పని చేసిన ఆర్ విక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా డీపీఓగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా తెనాలి ఆర్డీవోగా పని చేస్తున్న ఆయన రవీంధర్‌ను ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారిగా బదిలీ చేయగా శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీపీఓ రవీంధర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డీపీఓను పలువురు డీఎల్‌పీఓలు, పంచాయతీ కార్యదర్శుల సంఘ ప్రతినిధులు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.