కృష్ణ

వైభవంగా వీరమ్మతల్లి ఊయల ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు: లక్షలాది మంది భక్తులు సమర్పించిన దీప కాంతులు, పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య వీరమ్మ తల్లి ఊయల ఉత్సవం శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన వీరమ్మతల్లి తిరునాళ్లలో అమ్మవారి ఊరేగింపు శనివారం సాయంత్రానికి స్థానిక ప్రధాన కూడలి వద్ద ఊయల స్తంభాల వద్దకు చేరుకున్నాయి. అప్పటికే లక్షలాది మంది భక్తులు స్థానిక సెంటర్‌కు చేరుకోవడంతో పురవీధులు జనసంద్రాన్ని తలపించాయి. ఎదురుగా గండ దీపాలు మొక్కుకున్న భక్తులు ఊరేగిం వెంట రాగా వీరమ్మతల్లి శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు ఇంటింటి హారతులు అందుకున్నారు. కీలకమైన ఊయల ఉత్సవంలో భాగంగా స్థానిక సెంటర్‌లోని ఊయల స్థంభాలకు కట్టిన ప్రత్యేక ఊయలలో అమ్మవారిని కూర్చోబెట్టి ఊయల ఊగించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సీఐ విశ్వనాథం నేతృత్వంలో 300 మంది పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఊయల ఉత్సవం అనంతరం అమ్మవారు ఆలయంలో కొలువుదీరారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు అల్పాహారం, మజ్జిగ, మంచినీరు సరఫరా చేసాయి. నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం రాత్రి తెల్లవార్లూ మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం విమర్శలకు తావిచ్చింది.