కృష్ణ

రూ.22 కోట్లతో బీడీసీపై వంతెనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: బుడమేరు డైవర్షన్ ఛానల్‌పై రూ.22కోట్ల వ్యయంతో వంతెనల నిర్మాణానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు శనివారం శంకుస్థాపనలు చేశారు. జి.కొండూరు మండలంలోని కొత్తకవులూరు, ఇబ్రహీంపట్నం మండలంలోని శాంతినగర్, ఈలప్రోలు వద్ద మూడు చోట్ల వీటి నిర్మాణాన్ని గత యేడాదే చేపట్టారు. ఇప్పటికే శిథిలమై ఉన్న వంతెనల స్థానంలో వీటిని నిర్మిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉమ మాట్లాడుతూ వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్ సమస్యలపై ఆరాతీశారు. నాయకులు సమన్వయంతో పనిచేస్తూ, చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు, టిడిపి సీనియర్ నేత జువ్వా రాంబాబు, మండల టిడిపి ఉపాధ్యక్షులు వరికూటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ మెప్పు కోసమే తరసాని వ్యాఖ్యలు

* సీఎం చంద్రబాబుపై విమర్శలు అర్ధరహితం * ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

మచిలీపట్నం, ఫిబ్రవరి 16: రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేయాలని చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి మెప్పు పొందేందుకే తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విమర్శించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తలసాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తోందని తలసాని చేసిన వ్యాఖ్యల్లో నిజమేంతో బీసీలే చెబుతారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ విమర్శలను వెదజల్లేందుకే తెలంగాణ నుండి చుట్టుచూపుగా వస్తున్న తలసాని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీసీలు అభివృద్ధి చెందారంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్నారు. బీసీల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీల అభ్యున్నతికి బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు చేసినట్లు తెలిపారు. బీసీలకు జరుగుతున్న మేలు చూసి ఓర్వలేక తలసాని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.