కృష్ణ

బీసీలను ఆకర్షించేందుకే ‘జగన్నాటకం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాజకీయ ఉనికి కోల్పోతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి బీసీలను ఆకర్షించేందుకు బీసీ గర్జన పేరుతో జగన్నాటకానికి తెర లేపారని పార్లమెంట్ ప్యానల్ స్పీకర్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గాన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపిన జగన్‌కు మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. జగన్ నాయకత్వంలో ఏ ఒక్క బీసీ నేతకైనా ప్రాధాన్యత ఇచ్చారా..? ఎంత మంది బీసీలను చట్ట సభలకు పంపారో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎంపీ కొనకళ్ల జగన్‌కు సూచించారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అన్న నానుడి రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ చెంతన ఉన్న బీసీలను ఆకర్షించేందుకు జగన్ ఎన్ని పిల్లిముగ్గలు వేసినా ఆకర్షించలేరన్నారు. తెలుగుదేశం పార్టీ అవిర్భావం నుండి నేటి వరకు బీసీల సంక్షేమానికి కృషి చేస్తూనే ఉందన్నారు. నేడు బీసీలంతా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యమేనన్నారు. రాజకీయంగా వెనుకబడిన బీసీలను చట్టసభలకు పంపటంతో పాటు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించిందన్నారు. మరో పక్క బీసీల్లో ప్రతి వర్గానికి ఫెడరేషన్‌లు ఏర్పాటు చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలకు ఏం చేశారో చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ హయాంలో వేలాది మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. దీనికి కారణంగా బీసీల పట్ల వైఎస్‌ఆర్ అవలంభించిన వ్యతిరేక విధానాలు కాదా అని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ బీసీల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండి పోయే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూనే బీసీల అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేశారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ రమేష్ నాయుడు, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర డైరెక్టర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.