కృష్ణ

34 ఆలయాలకు అభివృద్ధికి రూ.5కోట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న 34 దత్తత ఆలయాల అభివృద్ధి కోసం సుమారు రూ.5కోట్లు కేటాయించి వాటి అభివృద్ధికి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈవో వీ కోటేశ్వరమ్మ తెలిపారు. ఆదివారం ఉదయం ఈవిలేఖరితో మాట్లాడుతూ వివిధ కారణాలతో దేవస్థానం దత్తత తీసుకున్న చిన్న ఆలయం నుండి అతి పెద్ద ఆలయం వరకు అన్నింటికీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కోట్లాది రూపాయలను వెచ్చించి అభివృద్ధి పనులను నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వివరించారు. బందరు గొడుగుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.3కోట్లు, ఆగిరిపల్లి శ్రీ శోభనాద్రీ లక్ష్మీ నరసింహాస్వామి వేదపాఠశాలకు రూ.6లక్షలు, శ్రీ కాకుళంలోని శ్రీ మహావిష్ణు ఆలయంలో రూ.లక్షతో ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయించినట్లు ఈవో వివరించారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధిలోని శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి దేవస్థానం (బుద్దావారిగుడి) అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొమరవోలు శ్రీ అమర లింగేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం, సీతమ్మవారి పాదాల చెంత ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్చరస్వామి ఆలయంలో స్టీలు వస్తువులను కొనుగోలు చేసేందుకు రూ.5లక్షలు, శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం, ఎనికేపాడు శివాలయం, పెద్ద ఓగిరాల శ్రీ భ్రమరాంబమల్లేశ్వరస్వామి ఆలయాలను బాగు చేయిస్తున్నట్లు ఆమె వివరించారు. గొల్లపూడి శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానం, హంసలదీవి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా కల్యాణ మండపం నిర్మాణం, చేపల చెరువుచుట్టు పెన్నిలింగ్ ఏర్పాటుకు సుమారు రూ.50లక్షలు కేటాయించామని, వాటిలో ఇప్పటికే కొన్ని పనులు చేపట్టినట్లు చెప్పారు. గుంటూరు జిల్లా సీతానగరంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం జీర్ణోద్దరణ పనులకు రూ.30లక్షలు, కొలనుకొండ శ్రీపట్ట్భా రామస్వామి ఆలయానికి రూ.40లక్షలు ఇలా అన్ని ఆలయాల అభివృద్ధి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు వివరించారు. దత్తత ఆలయాల్లో నిత్యం పూజలు, వైదిక కార్యక్రమాల పర్యవేక్షణ, అర్చకుల జీతాల పెంపుదల, ఆస్తుల పరిరక్షణ చేపట్టినట్లు పేర్కొన్నారు. దత్తత ఆలయాల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అక్కడ సిబ్బంది నేరుగా వాటిని తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించినట్లు తెలిపారు. దత్తత ఆలయాల పరిరక్షణ, ఆస్తుల పరిరక్షణ, అద్దెలు పెంపుదలపై కూడా సిబ్బంది దృష్టి సారించాలని ఈవో వీ కోటేశ్వరమ్మ సూచించారు. కొన్ని ఆలయాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరికొన్ని ఆలయాల్లో కొద్ది రోజుల్లో పనులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఆలయంలోక్షేత్రస్థాయి లోపాలు అక్కడ సిబ్బందికే బాగా తెలుసు కాబట్టి నేరుగా వారు ఈసమస్యలను తనదృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించటం జరుగుతోందనీ ఈవో వీ కోటేశ్వరమ్మ చెప్పారు.