కృష్ణ

పూరగుట్టను సందర్శించిన జేసీ కృత్తికా శుక్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: జిల్లా జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా సోమవారం మైలవరం సమీపంలో పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీకి ఉద్దేశించిన పూరగుట్ట భూమిని సందర్శించారు. గత కొంతకాలంగా ఈభూమి వివాదంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈభూమిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆశించి ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయటం, ఆ భూమి భూమార్పిడి జరగకపోవటంతో చట్టపరమైన చిక్కుల కారణంగా పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నాయకులపై నమ్మకం లేక పేదలే స్వచ్చందంగా ఆ భూమిలోకి వెళ్ళి ఎవరికి వారు ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. దీనిపై అటు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా, సీపీఎం, సీపీఐ నేతలు పూరగుట్టను సందర్శించి ఎవరికి వారు తమ పార్టీకి చెందిన పేదలను అక్కడికి పంపటంతో పూరగుట్ట ప్రాంతం వివాదాస్పదంగా తయారైంది. ఈనేపధ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూరగుట్ట భూమిని సందర్శించారు. భూమికి సంబంధించిన వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు అక్కడికి చేరుకుని పూరగుట్టలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై జేసీకి ఫిర్యాదు చేశారు. పూరగుట్టలో ఉన్న కోటి రూపాయల విలువైన కలపను అధికార పార్టీకి చెందిన నేతలు అక్రమంగా నరికి ప్రభుత్వానికి జమ చేయకుండా అమ్ముకున్నారని, భూమార్పిడి జరగకుండా అక్రమంగా లే అవుట్ వేసి వారిష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అర్హత కలిగిన వారికే ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలని సీపీఎం నేతలు చాట్ల సుధాకర్, వజ్రాల వెంకటరెడ్డి, ఇస్సాక్‌లు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అయ్యప్పనగర్‌లో ఉన్న స్థలాలను అర్హులకు ఇవ్వకుండా టీడీపీ నేతలు వారికిష్టమైన వారికి ఇస్తున్నారని, అర్థరాత్రి సమయంలో ఇళ్ళకు వెళ్ళి ఇస్తున్నారని ఈక్రమంలో అసలైన పేదలకు అన్యాయం జరుగుతుందని వైకాపాకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యులు షేక్ అబ్దుల్ రహీమ్, చిట్టిబాబు తదితరులు జేసీకి ఫిర్యాదు చేశారు. పూరగుట్ట స్థలాన్ని భూబదలాయింపు చేసి అర్హత కలిగిన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఫిర్యాదులను పరిశీలించి, విచారణ అనంతరం న్యాయం చేస్తానని, దీనిపై పూర్తి స్థాయి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందిస్తామని జేసీ వారికి వివరించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ వైకెవి అప్పారావు, వీఆర్వోలు దేవ ప్రియుడు, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.