కృష్ణ

‘మీకోసం’ అర్జీల పరిష్కారంలో పారదర్శకత : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే ‘మీకోసం’లో ప్రజల నుండి వచ్చే అర్జీల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి హాజరైన ఆయన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మీకోసం’పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెరిగేలా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఒకసారి వచ్చే అర్జీ మరోసారి రాకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో అర్జీలను పరిష్కరించాలన్నారు. అలాగే మీకోసం కార్యక్రమానికి శాఖాధిపతులు విధిగా హాజరు కావాలన్నారు. ఇకపై ప్రతి సోమవారం 9.30ని.లకే మీకోసం కార్యక్రమం ప్రారంభవుతుందన్నారు. గంట పాటు అర్జీల పరిష్కార చర్యలతో పాటు శాఖల మధ్య సమన్వయంపై సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 పిడుగు బాబూరావు, ముడ వీసీ విల్సన్ బాబు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.