కృష్ణ

ఎన్నికలకు సమాయత్తమవ్వండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పిలుపునిచ్చారు. ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం ఆయన తన ఛాంబర్ నుండి జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ బూత్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్‌కు అనువుగా లేని పోలింగ్ బూత్‌లను గుర్తించాలన్నారు. మార్పులు, చేర్పులకు సంబంధించి నివేదికలను తక్షణమే అందించాలన్నారు. ఓటర్ల జాబితాలు, రూట్ మ్యాప్, పోలింగ్ స్టేషన్లు, సెక్టార్ అధికారులను జాబితాలను సిద్దం చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కృష్ణా, గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నోటిఫికేషన్ రానుందని తెలిపారు. ఇందుకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల వివరాలు, రూట్ మ్యాప్‌లు, స్ట్రాంగ్ రూమ్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫారం-6, 7, 8పై ఏ విధమైన అంశాలు పెండింగ్‌లో లేకుండా నియోజకవర్గాల వారీ అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల పరిదిలోని గ్రామాలకు సంబంధించి వీఐపీలు, వీవీఐపీలు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రెటీలు, సాంస్కృతిక రంగాలకు చెందిన వారందరూ జాబితాల్లో ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విభిన్న ప్రతినావంతులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి సౌకర్యార్ధం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద వీల్ చైర్లను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు పోలింగ్ స్టేషన్ల వివరాలను, సెక్టార్ అధికారుల వివరాలు, రూట్ మ్యాప్‌లు, స్ట్రాంగ్ రూమ్, పోలింగ్ స్టేషన్ల మార్పులు, కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ల వివరాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ప్రతి రోజూ ఎన్నికలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బూత్ లెవల్ అధికారి పేరు, మొబైల్ నెంబరు డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇవీఎం, వివి ప్యాట్స్‌పై ప్రజలకు మాక్ పోలింగ్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్, జెసీ-2 పిడుగు బాబూరావు, బందరు, గుడివాడ ఆర్డీవో జె ఉదయ భాస్కర్, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.