కృష్ణ

నేడు వెంకన్న తిరుకళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి దత్తత దేవాలయమైన మైలవరంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరుకళ్యాణం ఈనెల 19న రాత్రి 9గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కార్యక్రమాలలో భాగంగా నిత్య విధులతోపాటు రాత్రి 7గంటల నుండి 9గంటల వరకూ శ్రీ బాలభారతి నాట్యమండలి మైలవరం వారిచే, శ్రీ షిరిడీ సాయి బాబా భక్త సమాజం మైలవరం వారిచే అన్నమాచార్య భక్తిగీతాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 9గంటల నుండి స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ద్వారకా తిరుమల దేవస్థానం వేద పండితులు, అర్చక స్వాములచే స్వామి వారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వామి వారి కళ్యాణాన్ని ప్రముఖ వ్యాఖ్యాతలచే వ్యాఖ్యానం చెప్పించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కల్యాణం అనంతరం స్వామి వారిని, అమ్మవార్లను గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 20న స్వామి వారి రధోత్సవం బ్యాండు, సన్నాయి మేళాలతో, కనకతప్పెట్లతో వినుల విందుగా గ్రామోత్సవం నిర్వహించన్నునట్లు కమిటీ సభ్యులు వివరించారు. ఈకార్యక్రమాలన్నీ ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, పాలక మండలి చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.