కృష్ణ

మచిలీపట్నం-సికింద్రాబాద్‌కు 10 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): మచిలీపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య పది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిహెచ్ రాకేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 07049 నెంబరుతో మార్చి 3, 10, 17, 24, 31 తేదీలలో మచిలీపట్నం నుండి మధ్యాహ్నం 3.05ని.లకు ప్రత్యేక రైళ్లు బయలుదేరి అదే రోజు రాత్రి 10.35ని.లకు సికింద్రాబాద్ చేరతాయన్నారు.. 07050 నెంబరుతో మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో సికింద్రాబాద్ నుండి 11.55ని.లకు బయలుదేరి మచిలీపట్నంకు చేరతాయన్నారు. ఈ రైళ్లలో ఏసీ-2, ఏసీ-3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ 2వ తరగతి కోచ్‌లు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని బందరు పరిసర ప్రాంత రైల్వే ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.