కృష్ణ

బీసీల వ్యతిరేకి చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల వ్యతిరేకని, ఆయన డిఎన్‌ఎలోనే బీసీల పట్ల వ్యతిరేకత, చులకలన భావం ఉందని మాజీ మంత్రి, జిల్లా వైసిపి అధ్యక్షుడు కె పార్థసారధి ఆరోపించారు. తోట్లవల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలుకలూరిపేటలో సోమవారం చంద్రబాబు హెలికాప్టర్ దిగేందుకు బీసీ వర్గానికి చెందిన రైతు పండిస్తున్న బొప్పాయి, పూలతోటల్లో అతని అనుమతి లేకుండా బలవంతంగా హెలిపాడ్ నిర్మించారని, సదరు రైతు వ్యతిరేకిస్తే కొట్టి చంపివేశారని, ఈ మర్డర్ కేసు ఎవరిపై పెడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే గతేడాది వైఎస్ జగన్ హనుమాన్‌జంక్షన్‌లో తెగుళ్ళతో దెబ్బతిన్న తోటలను పరిశీలిస్తే జగన్‌తో సహ వైసిపి నేతలపై పంటకు నష్టం కలిగించారంటు కేసులు పెట్టిన విషయం మరిచారా అని సారధి ప్రశ్నించారు. హనుమాన్‌జంక్షన్‌లో మినుముతోట అగ్రకులానికి చెందిని కాబట్టే ఆ రోజు కేసులు పెట్టారని అన్నారు. ఏలూరులో వైసిపి అధ్యక్షుడు జగన్ నిర్వహించిన బీసీ గర్జన సభ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక భరోసా కల్పించిందన్నారు. ఎందుకంటే ఏ హామి ఇచ్చినా దానికి చట్టబద్దత కల్పిస్తామని హామి ఇవ్వటంతో జగన్‌పై ప్రజల్లో నమ్మకం కలిగిందన్నారు. బీసీ గర్జన ఉభ విజయవంతం కావటంతో టిడిపి నేతలు చౌకబారు విమర్శలకు దిగటం సరికాదని సూచించారు. సమావేశంలో పామర్రు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్, ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జగన్ వెంటే బీసీలు

మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 19: బీసీలు అందరూ వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి వెనుకే ఉన్నారని అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, వైకాపా నేత బొర్రా విఠల్ అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ కలలను వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి సాకారం చేస్తారన్నారు. బీసీల సంక్షేమానికి సంవత్సరానికి రూ.15వేల కోట్లు కేటాయించటంతో పాటు బడ్జెట్‌లో 25శాతం కేటాయిస్తారన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షలను జగన్మోహనరెడ్డి నెరవేరుస్తారన్నారు. బీసీ డిక్లరేషన్ చారిత్రాత్మకం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహనరెడ్డి ప్రకటించిన పథకాలను కాపీ కొడుతున్నాడని మాజీ ఎఎంసీ చైర్మన్ మోకా భాస్కరరావు ఆరోపించారు. సమావేశంలో వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

ఈవీఎంలపై అవగాహన తప్పనిసరి

అవనిగడ్డ, ఫిబ్రవరి 19: ఓటర్లకు ఈవీఎంలపై పూర్తి అవగాహన కల్పించాలని నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రశేఖరరావు కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈవీఎంలపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈవీఎంలలో ఏ విధమైన అవకతవకలు ఉండవని, ఇంటర్నెట్ ఉండనందున బ్యాటరీ, చిప్ ద్వారా మాత్రమే పని చేస్తాయన్నారు. ట్యాంపరింగ్ సాధ్యపడదని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికలు నిర్వహించే అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఏ ఒక్క పార్టీకి విధేయతగా ఉండరాదన్నారు. ఈవీఎంలను ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మాత్రమే భద్రపర్చాలని సూచించారు. ఏమైనా అక్రమాలకు అధికారులు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, గత ఎన్నికల్లో సస్పెండైన సిబ్బందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా హారైన బూత్‌లెవల్ అధికారులు, వీఆర్‌ఓలు, వీఆర్‌ఎలు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలపై చంద్రశేఖరరావు, ఉమామహేశ్వరరావు అవగాహన కల్పించారు. డీఎస్పీ పోతురాజు పాల్గొని శాంతి భద్రతల పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.