కృష్ణ

‘కృష్ణా’లో టీడీపీ గెలుపు ఏక పక్షం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్భాగంగా కొనసాగుతున్న జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఏక పక్షం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. బందరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలతో మంగళవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. నియోజకవర్గంలో ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉందో నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షకు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతోపాటు బందరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మరికొంత మంది నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశా నిర్ధేశం చేశారు. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 16 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాలన్నారు. గడిచిన ఐదేళ్లల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే రీతిలో తెలియ చేయాలన్నారు. ముఖ్యంగా దశాబ్దాల నాటి కల బందరు పోర్టును ఏ విధంగా సాకారం చేశామో ప్రజలకు తెలియచెప్పాలన్నారు. పట్టిసీమ ద్వారా డెల్టా రైతులు పొందిన ప్రయోజనాలపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలన్నారు. అన్నదాత-సుఖీభవ పథకం కింద రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల శాసనసభ్యులు, ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.