కృష్ణ

టీడీపీ హయాంలో ప్రతి ఒక్కరికీ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బందరు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. మంత్రి రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఒక్కొక్క కుటుంబానికి ఆరు నుండి ఎనిమిది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. ప్రజల ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీకే ఉన్నాయన్నారు. జిల్లాలో 83 శాతం ప్రజలు ప్రభుత్వ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పెన్షన్ రెట్టింపు చేయడం ద్వారా వృద్ధ, వికలాంగుల్లో ఆత్మ స్థైర్యం పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.1.5లక్షలుగా ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పరిమితిని తమ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2.5లక్షలకు పెంచామని, ప్రస్తుతం రూ.5లక్షలకు పెంచినట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అతివిశ్వాసంతో ఉండకుండా ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో పార్టీ మరోసారి ఘన విజయం చేకూరేలా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఇలియాస్ పాషా, కుంచే దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.