కృష్ణ

అగ్రిగోల్డ్ డిపాజిట్లు చెల్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు గాను దరఖాస్తులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా తీసుకోనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. తన ఛాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.10వేలు, అంతకన్నా తక్కువ మొత్తం డిపాజిట్లు కలిగిన అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లు చెల్లించేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. జిల్లాలోని 13 జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారి బ్యాంక్ ఎకౌంట్లలో సొమ్ము జమ చేస్తామన్నారు. దరఖాస్తుదారులు డిపాజిట్ రశీదు, బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఓటరు ఐడీ లేదా పాన్ కార్డు నకళ్లను దరఖాస్తుతో పాటు జత చేయాలన్నారు. 22వ తేదీన మచిలీపట్నంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 23వ తేదీన విజయవాడ లీగల్ సెల్ సర్వీసెస్ అధారిటీలో విజయవాడ అర్బన్, రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంకిపాడు మండలాలకు చెందిన వారు, 25వ తేదీన గన్నవరం మండల న్యాయ సేవాధికార సంస్థలో గన్నవరం, ఉంగుటూరు, ఆగిరిపల్లి మండలాలు, 26వతేదీన గుడివాడ మండల న్యాయ సేవాధికార సంస్థలో గుడివాడ, పామర్రు, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలు, 27వ తేదీన నూజివీడు న్యాయ సేవాధికార సంస్థలో నూజివీడు, బాపులపాడు, ముసునూరు మండలాలు, 28వ తేదీన నందిగామ న్యాయ సేవాధికార సంస్థలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు, రెడ్డిగూడెం మండలాలు, మార్చి 1వ తేదీన అవనిగడ్డ న్యాయ సేవాధికార సంస్థలో అవనిగడ్డ, చల్లపల్లి, మొవ్వ, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, మోపిదేవి మండలాలు, 2వ తేదీన కైకలూరు న్యాయ సేవాధికార సంస్థలో కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాలు, 5వ తేదీన తిరువూరు న్యాయ సేవాధికార సంస్థలో తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, చాట్రాయి, ఎ.కొండూరు మండలాలు, 6వ తేదీన జగ్గయ్యపేట న్యాయ సేవాధికార సంస్థలో జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలు, 7వ తేదీన బంటుమిల్లి న్యాయ సేవాధికార సంస్థలో బంటుమిల్లి, కృత్తివెన్ను, మైలవరం మండలాలు, 8వ తేదీన ఉయ్యూరు న్యాయ సేవాధికార సంస్థలో ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాలకు సంబంధించిన బాధితులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు కోరారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.