కృష్ణ

50 పడకలతో ప్రభుత్వాసుపత్రి విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ఎన్నో ఏళ్ళుగా మైలవరం ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న ప్రభుత్వాసుపత్రి విస్తరణ ఎట్టకేలకూ మంత్రి ఉమ చొరవతో పరిష్కారానికి నోచుకుంది. మైలవరం ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని గత 20 ఏళ్ళుగా ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమ మేనిఫెస్టోలో ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ సైతం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దాని ప్రకారంగా ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 50 పడకలుగా విస్తరింప చేస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు మంజూరు చేయించారు. ఇందుకు గానూ 3 కోట్ల రూపాయల నిధులను సైతం మంజూరు చేయించారు. ఈనిధులతో ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా విస్తరింపజేయటంతోపాటు 17 మంది అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నట్లు మంత్రి ఉమ బుధవారం వెల్లడించారు. ఏటా 60.34 లక్షల రూపాయల వ్యయంతో ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్‌తోపాటు 15 మంది ఇతర విభాగాలకు చెందిన స్ట్ఫాను భర్తీ చేయటానికి అవసరమైన జీఓను విడుదల చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నం వడ్డెర కాలనీలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలు, దాములూరులో షాదీఖానా నిర్మాణానికి 30 లక్షల రూపాయలు మంజూరైనట్లు మంత్రి ఉమ వెల్లడించారు. ఈనిధులు విడుదల చేయించటం పట్ల బీసి సంఘ నేతలు, ఆసుపత్రి విస్తరణ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.