కృష్ణ

పేదల సొంతింటి కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పేదల సొంతింటి కలను సాకారం చేసినందుకు తనకెంతో ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక బైపాస్ రోడ్డు గో సంఘం వద్ద నిర్మించిన జీ ప్లస్ 3 గృహాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గురువారం లాటరీ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గత కొనే్నళ్లుగా పరిష్కారం కాని నివేశన స్థలాల సమస్యకు జీ ప్లస్ 3 రూపంలో తమ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపిందన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని కారణంగా జీ ప్లస్ 3 గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గంలో 6వేల 400 గృహాలను నిర్మించినట్లు తెలిపారు. మార్చి 15వ తేదీన జీ ప్లస్ 3 గృహాలకు సంబంధించి గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సింగపూర్ తరహా ఆధునిక గృహాలను జీ ప్లస్ 3 ద్వారా నిర్మించామన్నారు. మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడంతో పాటు ప్రభుత్వం పెన్షన్లు 10 రెట్ల పెంపు, డ్వాక్రా గ్రూపులకు పసుపు-కుంకుమ కింద రూ.10వేలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ టిట్‌కో ప్రాజెక్ట్ ఆఫీసర్ చిన్నోడు, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెపాటి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.