కృష్ణ

సర్వేక్షణ్ ర్యాంకు పారిశుద్ధ్య కార్మికుల ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): 2019 సర్వేక్షణ్ సర్వేలో నగరానికి మొదటి ర్యాంకు సాధించడంలో పారిశుద్ధ్య కార్మికులే కీలక పాత్ర వహించాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు, కొబ్బరి నూనె, సబ్బులు తదితర సామగ్రిని పంపిణీ చేసిన మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పంపిణీ చేస్తున్నామన్నారు. రోగ, క్రిమి కీటకాలతో ఎటువంటి ఆనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా అందజేస్తున్న ఈవస్తువులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే కార్మికులు తమ విధుల పట్ల ఎటువంటి అలక్ష్యం వహించకుండా బాధ్యతగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 010 జీతాల చెల్లింపులు జీవో అమలు జరుగుతున్నందున వీఎంసీకి ఎంతో ఆర్థిక ఉపశమనం జరగడమే కాకుండా నగరాభివృద్ధికి మరిన్ని నిధులు సమకూరుతున్నాయన్నారు. జీవో విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మేయర్ శ్రీ్ధర్ ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కమిషనర్ జే నివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం 2018లో జరిగిన సర్వేక్షణ్‌లో నగరానికి జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు వచ్చిందని, అదేవిధంగా ప్రస్తుతం 2019 సర్వే జరుగుతున్న విషయాన్ని గుర్తించి నగరానికి మొదటి ర్యాంకు వచ్చేలా కార్మికులు కృషి చేయాలని కోరారు. ర్యాంకు సాధనలో పారిశుద్ధ్య కార్మికుల కృషి నిరుపమానమని తెలిపిన నివాస్ నగర పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ లేకుండా తమ విధులను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, సీఎంహెచ్‌ఓ అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.