కృష్ణ

భావి ఇంజనీర్లపైనే అమరావతి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, : ప్రపంచం మెచ్చే ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణం బావి ఇంజనీర్లపేనే ఉందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 21వ వార్షికోత్సవం కళాశాల ఆవరణలో ఘనంగా, కోలాహలంగా జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి ఉమ మాట్లాడుతూ ప్రపంచాన్ని ఇంజనీర్లే శాసిస్తున్నారని సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. వారిని మనం ఉపయోగించుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజులలో రాజధానిని చూడటానికి మేధావులు రానున్నారన్నారు. నేడు పోలవరం, పట్టిసీమ, చింతలపూడి నిర్మాణాలు ఇంజనీర్ల చలవే నన్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పెద్దదైనా కూచిపూడి ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం ఇబ్రహీంపట్నం వద్దగల కృష్ణానదిపై నిర్మాణం జరుగుతుందంటే అది ఇంజనీర్ల గొప్పతనమేనన్నారు. నీటిలో ఫిల్లర్లు వేసినా పోలవరం ప్రాజెక్టులో 300 అడుగుల లోతు బండరాయిని తవ్వినా అది ఇంజనీర్ల శక్తిసామర్థ్యమేనన్నారు. పది కోట్ల క్యూబిక్ మీటర్ల మండరాయిని, 20 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని అవలీలగా పోలవరం ప్రాజెక్టు వద్ద తీయగలిగామంటే అది ఇంజనీర్లకే సాధ్యమైందన్నారు. పోలవరంలో రాక్‌ఫిల్ డ్యాం, కాఫర్ డ్యాంల నిర్మాణం నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే సాధ్యమైందన్నారు. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డ్యాం తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఏర్పడుతోందన్నారు. మచిలీపట్నం పోర్ట్, కనకదుర్గ వారధి, ఐకాన్ బ్రిడ్జి, అమరావతి నిర్మాణాలు ఇంజనీర్ల అద్భుతాలేనన్నారు. ఎల్బీఆర్సీఇ రాబోయే రోజులలో డీమ్డ్ యూనివర్శిటీగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. గడచిన నాలుగున్నరేళ్ళళో 70 కోట్ల రూపాయలు తన శాఖ ద్వారా వెచ్చించామంటే అది ఇంజనీర్లు చేసిన నిర్మాణాలు, అద్భుతాలేనన్నారు. జిల్లాలో మెట్ట రైతాంగానికి తాగు, సాగునీటిని అందించటానికి ఐదువేల కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పధకం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోటీలలో, విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులచే నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈకార్యక్రమంలో కళాశాల చైర్మన్ లకిరెడ్డి బాలిరెడ్డి, కోచైర్మన్ జయప్రకాష్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రసాద్‌రెడ్డి, ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఎస్వీఎన్ నివృత్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, కె తిమ్మారెడ్డి, కృష్ణారెడ్డి, కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

స్ర్తి జాతి మణిపూస ‘సుశీల’

గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 23: స్ర్తి జాతి మణిపూస ఎల్లలు దాటిన సౌజన్యానికి ప్రతీక పి సుశీల అని స్థానిక ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డా. వల్లూరుపల్లి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలో జక్‌ఫెస్ట్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన వేడుకల్లో పద్మభూషణ్, గాన సరస్వతి పి సుశీల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మాట్లాడుతూ 4వేలకు పైగా వివిధ భాషల్లో పాటలు పాడి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను పి సుశీల సాధించారన్నారు. హేమసుందర్, శ్రావణ భార్గవి, హిందూజ, సోని, శ్రీకాంత్, రేణుకుమార్, మంగ్లి ఆలపించిన సినీ గీతాలు రంజింప చేశాయి. అనంతరం పి సుశీలను దుశ్వాలువ, జ్ఞాపిక, గజమాలతో ఘనంగా సత్కరించారు.