కృష్ణ

జంక్షన్ జామ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్‌జంక్షన్: ఉపరాష్ట్రపతి ముప్పవరపువెంకయ్యనాయుడు నూజివీడు పర్యటనతో హనుమాన్‌జంక్షన్‌లో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. షెడ్యూల్ ప్రకారం గురువారం మధ్యాహ్నం 3:15 లకు అత్కూరు నుంచి రోడ్డుమార్గాన బయలుదేరిన వెంకయ్యనాయుడు కాన్వాయ్ జంక్షన్ కూడలి మీదుగా 4:00లకు నూజివీడుకు చేరుకోవాలి. ఈ సమయంలో కాన్వాయ్‌ని జంక్షన్‌కూడలిని దాటించేందుకు జిల్లా పోలీసులు చేపట్టిన భద్రతాచర్యలపై స్ధానికులు అసహనం వ్యక్తం చేశారు.భద్రతా చర్యలలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా 12 గంటల నుంచే పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. విజయవాడ, నూజివీడు రోడ్ల వెంబడి వున్న దుకాణాలను 2గంటల నుంచి 6గంటల వరకు మూసి వేయాలని అదేశించారు.భద్రతా చర్యల పట్ల అవగహన లేని కొంత మంది దుకాణాదారులు షాపులను మూసివేయలేదు. ఈసమయంలోనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని షాపు యాజమానులు ఆరోపిస్తున్నారు.ఇది ఇలా వుంటే జాతీయ రహదారిపై విజయవాడ నుంచి ఏలూరు,ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలను రెండుసార్లు 30 నిముషాలపాటు పూర్తిగా నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై కీలోమీటర్ల మేర ట్రాఫిక్ స్ధంభించింది. నిత్యం ఎప్పుడు రద్థీగా వుంటే హనుమాన్ జంక్షన్ వాహనాల రాకపోకలు నిలిపివేతతో జంక్షన్ కూడలి బొసిపోయింది. ఎండతీవ్రతకు తోడు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉప రాష్ట్రపతి పర్యటన సంగతి ఏలా వున్న విధించిన అంక్షలతో ప్రజలు పోలీసులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రోటోకాల్ ప్రకారమే ట్రాఫిక్ ఆంక్షలు విధించామని, ఎవరినీ ఇబ్బందిపెట్టే ఉద్దేశం తమకు లేదని జంక్షన్ సీఐ రాజశేఖర్ వెల్లడించారు.