కృష్ణ

ఓటరు నమోదుకు నేడే ఆఖరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియకు శుక్రవారంతో గడువు ముగియనుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతున్న తరుణంలో ఓటుకు అధిక ప్రాధాన్యత ఉండగా, ఇటీవల ఓటు తొలగింపు చర్యలు తెరమీదకు రావడం అందరికీ తెలిసిందే. దీంతో ఓటుపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిలో ఓటరు తన ఓటు కోసం వీఎంసీ ఆఫీస్‌కు పరుగులు పెడుతున్నారు. శుక్రవారం చివరి రోజు కావడంతో దరఖాస్తుదారుల ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. కాగా ఇందుకనుగుణంగా అధికారులు ఆయా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఓటరు నమోదుకు రాజకీయ పార్టీలు కూడా తమవంతుగా సహకరిస్తూ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. 28వ డివిజన్ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తన డివిజన్ ఓటర్ల నమోదుకు తానే స్వయంగా దరఖాస్తులను పూరించడం విశేషం. ఓట్ల తొలగింపు ఆరోపణలు వెల్లువెత్తిన తరువాత ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరింత పెరిగిందనే చెప్పాలి. వయస్సుతో నిమిత్తం లేకుండా నడవలేని వృద్ధులు సైతం ఆఫీస్‌కు వచ్చి తమ ఓటును పరిశీలన చేసుకుంటుండగా, ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ వందలకు మించి వేలాది మంది ప్రజానీకం ఓటు కోసం దరఖాస్తులు చేసుకుంటుండగా, వీరికి సేవలందించేందుకు ప్రస్తుతం సెక్షన్‌లో ఉన్న అధికార, సిబ్బంది సరిపడక నానా అవస్థలు పడుతున్నారు. శుక్రవారంతో ముగియనున్న ఓటు దరఖాస్తు ప్రక్రియను పొడిగించాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై మరికొద్ది రోజులలో అనగా ఈనెల 18నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టుతున్న నేపథ్యంలో నమోదు పొడిగింపు సాధ్యం కాదన్న విషయం స్పష్టమవుతోంది. అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండగా, ఇప్పటి వరకూ స్వీకరించిన వేలాది దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రానున్న ఎన్నికలలో వీరందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వాస్తవానికి ఆన్‌లైన్ ద్వారా కానీ, స్వయంగా కానీ ఓటు నమోదు ప్రక్రియ నిరాటంకంగా సాగుతుంది. అయితే శనివారం నుంచి చేసుకునే దరఖాస్తుదారులకు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండదు. ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు అన్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఓటు నమోదు ప్రక్రియకు పార్టీనేతలు, డివిజన్ కార్పొరేటర్లు స్వయంగా దరఖాస్తులు పూరించి ఓటర్లకు సహకరిస్తుండటం గమనార్హం.