కృష్ణ

‘పెడన’కు వారసుడొచ్చాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన: సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుండి అధికార తెలుగుదేశం పార్టీకి వారసుడొచ్చాడు. రాజకీయ ఉద్ధండులను పక్కకు నెట్టి పెడన తెదేపా సీటును వశం చేసుకున్నాడు. అతనే సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తనయుడు కాగిత కృష్ణప్రసాద్. ఇప్పటి వరకు తన తండ్రి వెంకట్రావ్ సాగించిన ఎన్నికల కురుక్షేత్రాన్ని ఈ విడత ఆయన వారసుడిగా కృష్ణప్రసాద్ సాగించనున్నారు. గత వారం పది రోజులుగా పెడన టీడీపీ టికెట్‌పై సందిగ్ధత నెలకొంది. వయస్సు రీత్యా ఇబ్బందులకు గురవుతున్న కాగిత వెంకట్రావ్‌ను ఈ విడత ఎన్నికల్లో తప్పిస్తారని ప్రచారం జరిగింది. ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతోపాటు మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ కాగిత మాత్రం పెడన సీటును చేజార్చుకోకుండా తన కుమారుడికే వచ్చేలా చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. దీంతో ఇకపై కూడా పెడన తెదేపాలో కాగిత కుటుంబ హవా సాగనుంది. రాజకీయాల్లో కాగిత కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. వెంకట్రావ్ ఈ నియోజకవర్గం నుండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించారు. దాదాపు 36 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆయన తెలుగుదేశం గూటిలోనే కొనసాగుతూ వచ్చారు. సీనియర్ ఎమ్మెల్యేగా పలు విడతలు మంత్రి వర్గంలో ఆయనకు స్థానం దక్కకపోయినా పార్టీ మీద అసంతృప్తి గళం వినిపించలేదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేసిన కృష్ణప్రసాద్ వివాహితుడు. 3వ తరగతి చదువుతున్న ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 37 సంవత్సరాలు వయస్సు కలిగిన కృష్ణప్రసాద్ రాజకీయాల్లో మృధు స్వభావిగానే ముద్ర వేసుకున్నారు. గత కొంత కాలంగా ఆయన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా తండ్రికి బదులు ఆయనే నిర్వహించారు. బీసీ వర్గానికి చెందిన కృష్ణప్రసాద్‌కు రాజకీయ పరంగా నియోజకవర్గంలో తండ్రి ద్వారా సంక్రమించిన అనుచరగణం మెండుగా ఉండటం ఆయన గెలుపుకు ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. అధికార ప్రకటన వెలువడిన వెంటనే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి నియోజకవర్గంలోని కృత్తివెన్ను నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

‘జోగి’నే వరించిన పెడన వైసీపీ అభ్యర్థిత్వం
* ‘ఉప్పాల’కు తప్పని భంగపాటు * జనసేనలోకి వెళ్లే అవకాశం?
పెడన, మార్చి 17: నిన్న మొన్నటి వరకు పెడన నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోగి వర్సెస్ ఉప్పాలగా సాగిన పోరులో జోగే నెగ్గాడు. పెడన వైసీపీ సీటును మాజీ ఎమ్మెల్యే అయిన జోగి రమేష్‌కే ఖరారైంది. ఈ మేరకు ఆదివారం విడుదలైన జాబితాలో జోగి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధినేత జగన్ ఖరారు చేశారు. చివరి నిమిషం వరకు సీటు కోసం ప్రయత్నించిన ఉప్పాల రాంప్రసాద్‌కు మరోసారి అన్యాయం జరిగింది. గత ఎన్నికల్లో కూడా రాంప్రసాద్‌కు తీరని అన్యాయం జరిగింది. గెలుపు అవకాశాలు లేకపోయినా అధినేత ఆదేశం మేరకు పక్క నియోజకవర్గమైన కైకలూరు నుండి పోటీ చేసిన రాంప్రసాద్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ పెడన నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను స్వీకరించి పార్టీని భుజాన వేసుకున్నారు. మైలవరం వైసీపీలోకి వసంత కృష్ణప్రసాద్ రాకతో ఉప్పాలకు గడ్డుకాలం మొదలైంది. కృష్ణప్రసాద్ రాకక ముందు మైలవరం ఇన్‌ఛార్జ్‌గా సాగిన జోగి రమేష్‌కు పెడన ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో నాటి నుండి నేటి వరకు జోగి, ఉప్పాల వర్గాల మధ్య అంతర్యుద్దం సాగుతోంది. ముందస్తు హామీతోనే జోగి రమేష్ పెడన ఇన్‌ఛార్జ్‌గా వచ్చారు. అందులో భాగంగానే పెడన అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్ పేరును ఖరారు చేశారు. కానీ ఉప్పాల మాత్రం పెడన సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ జోగికే పెడన సీటును ఇవ్వటంతో ఉప్పాల వర్గం ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు పెడన రాజకీయాల్లో రాంప్రసాద్ తీసుకునే నిర్ణయం మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. తనకు అన్యాయం చేసిన వైఎస్‌ఆర్ సీపీని రాంప్రసాద్ వీడుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. జనసేనలోకి ఉప్పాల రాంప్రసాద్ వెళతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే రానున్న ఎన్నికల్లో ఉప్పాల జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు. పెడన ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ పదవులను మధ్యంతరంగా వైకాపాకు దక్కే విషయంలో ఉప్పాల పోషించిన పాత్రతో ఆగ్రహించిన అధికార పార్టీ రాంప్రసాద్ వ్యాపారాల మీద కూడా దెబ్బకొట్టింది. అయినప్పటికీ టెక్కెట్ వస్తుందన్న ఆశతో పార్టీలో పని చేస్తూ వచ్చారు. చిట్ట చివరకు జగన్ మొండి చెయ్యి చూపటంతో భవిష్యత్ రాజకీయంపై ఆదివారం ఆయన తన అనుచరులతో పెడనలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నుంచి ఆయనను నమ్ముకున్న కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. కొంత మంది కార్యకర్తలు పార్టీని వీడి వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఇచ్చిన సలహా గురించి కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా అన్నది రెండు రోజుల్లో తేలనుంది. పార్టీలో కొనసాగినట్లైతే టిక్కెట్ దక్కించుకున్న జోగి రమేష్ విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది. అది జరిగే పని కాదని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే జనసేన, టీడీపీలు ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కుడి భుజంగా ఉన్న ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు కూడా రాంప్రసాద్‌కు జరిగిన అన్యాయంపై కుతకుతలాడిపోతున్నారు. సోమవారం కూడా కార్యకర్తలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు రాంప్రసాద్ వర్గానికి చెందిన ఎంపీపీ అచ్యుతరావు తెలిపారు.