కృష్ణ

‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నేటి నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా విద్యా శాఖాధికారులు పూర్తి చేశారు. నేటి నుండి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 3వతేదీ వరకు జరగనున్నాయి. ఎమ్మెల్సీ పోలింగ్ కారణంగా ఈ నెల 22వతేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్-1 పరీక్షను ఏప్రిల్ 3వతేదీకి వాయిదా వేశారు. 269 కేంద్రాల ద్వారా 56,189 మంది ప్రైవేట్, రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాలను మూడు కేటగిరిలుగా విభజించారు. ఎ కేటగిరి కింద 154, బి కేటగిరి కింద 45, సి కేటగిరి కింద 70 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరిటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌ను నియమించారు. 3వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి గాను 14 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. సి కేటగిరిలోని 70 పరీక్షా కేంద్రాల్లో 70 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలైన మంతెన, జగ్గయ్యపేట, పెదతుమ్మిడి, గుడివాడ, ఊటుకూరు జెడ్పీ హైస్కూల్స్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను విద్యార్థుల కోసం నడపనున్నారు. పరీక్షా సమయానికి అనుగుణంగా సర్వీసులను నడపనున్నారు.