కృష్ణ

‘కాగిత’ అభ్యర్థిత్వంతో కొనకళ్లకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్, పెడన అసెంబ్లీ అభ్యర్థిత్వాల విషయాల్లో అధికార తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు పెనవేసుకుపోయిన చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పెడన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తనయుడు కాగిత కృష్ణప్రసాద్ పేరు ఖరారు కావటంతో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు లైన్ క్లియర్ అయ్యినట్టైంది. ఇప్పటి వరకు పలు అంశాల కారణంగా ఈ రెండు అభ్యర్థిత్వాలకు ముడి పడింది. బలమైన సామాజిక వర్గానికి నాయకుడైన దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికల ముందే రాధా ఎమ్మెల్సీ పదవి హామీతో తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆలోచన చేసినప్పటికీ తన సామాజిక వర్గం నుండి వచ్చిన విమర్శల కారణంగా తలొగ్గారు. కానీ ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన రాధాను మచిలీపట్నం పార్లమెంట్ బరిలో నిలపాలని అధినేత భావించారు. పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కాగిత వెంకట్రావ్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావు నిలిపి ఇరువురికి న్యాయం చేద్దామని చూశారు. కానీ పెడన అసెంబ్లీ సీటు విషయంలో కాగిత వెనక్కి తగ్గకపోవటంతో రాధాకు బెర్త్ కరువైంది. కొనకళ్ల కూడా పెడన అసెంబ్లీ నుండి పోటీకి విముఖత వ్యక్తం చేశారు. కానీ ఒక దశలో అధినేత నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాగిత వెనక్కి తగ్గకపోవటం, కొనకళ్ల అయిష్టత ప్రదర్శించటంతో చేసేది లేక అధినేత చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ విడత ఎన్నికల్లో ప్రచారం చేయాలని కోరారు. ఇందుకు రాధాకృష్ణ సమ్మతించినట్టు సమాచారం. తన సామాజిక వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రాధా పోటీ చేయడం కన్నా ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడమే మేలని భావించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పెడన అసెంబ్లీకి కాగిత అభ్యర్థిత్వం ఖరారు కావటంతో సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు మార్గం సుగమం అయ్యిందనే చెప్పాలి.