కృష్ణ

నెగ్గిన పంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అధికార తెలుగుదేశం పార్టీలో గత వారం పది రోజులుగా కొలిక్కి రాని సమస్యగా మారిన పెడన, పామర్రు అభ్యర్థిత్వాలకు సంబంధించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు. గత శనివారం అర్ధరాత్రి విడుదల చేసిన రెండవ విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, ఉప్పులేటి కల్పనలు తమ పంతం నెగ్గించుకున్నట్లైంది. ముందు నుండి ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాల మార్పు ఉంటుందని అంతా భావించారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌లకు ఆయా నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితి ఉందని అధిష్టానానికి రిపోర్టులు వెళ్లటంతో అధినేత చంద్రబాబు ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో అచితూచి వ్యవహరించారు. సిట్టింగ్‌లకు ఇవ్వకపోతే పార్టీకే నష్టమని పార్టీలోని కొంత మంది అధినేతకు సూచించటంతో సిట్టింగ్‌లకే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. ఈ విడత ఎన్నికల్లో పెడన సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తన వారసుడిగా కుమారుడు వెంకట కృష్ణప్రసాద్‌ను ఎన్నికల బరిలో నిలిపారు. వయస్సు రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకట్రావ్ గతంలోనే తన కుమారుడిని రాజకీయ వారసుడిగా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేశారు. అంతేకాకుండా గత ఏడాదిగా కుమారుడిని వెంట పెట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అధినేత చంద్రబాబు కూడా కాగిత కుమారుడి కృష్ణ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు టికెట్ విషయంలో నిన్న మొన్నటి వరకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎట్టకేలకు ఆమెనే టికెట్ వరించింది. పామర్రు సీటు కోసం మాజీ ఎమ్మెల్యే డివై దాస్ తెర వెనుక ప్రయత్నాలు చేశారు. 2009 ఎన్నికల్లో డివై దాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తన హయాంలో నియోజకవర్గ ప్రజలకు ఆయన మరింత దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికల్లో రాష్ట్ర విభజనతో సంక్షోభానికి గురైన కాంగ్రెస్ పార్టీలోనే దాస్ కొనసాగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఐదేళ్లుగా ఆయన ఏ పార్టీలో చేరకుండా స్థబ్ధుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో దాస్ తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సీపీ రెండు పార్టీల్లోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఏ పార్టీలోనూ ఆయన సీటు తెచ్చుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం చివరి వరకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.