కృష్ణ

కృష్ణాలో అభ్యర్థిత్వాలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కృష్ణాజిల్లాకు సంబంధించి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం ఇడుపులపాయ వద్ద దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రకటించారు. ముందు నుండి అనుకున్న వారికే జగన్ అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఇటీవల వైసీపీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్లను అధినేత ప్రకటించారు. విజయవాడ తూర్పు మినహా మిగిలిన 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతున్న వారికే టికెట్లు ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవికి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో విజయవాడ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ బొప్పన భవకుమార్ ఆ టికెట్‌ను దక్కించుకున్నారు. ఎంపీ అభ్యర్థి పీవీపీకి భవకుమార్ అత్యంత సన్నిహితుడు. పీవీపీ అభ్యర్థన మేరకే భవకుమార్‌కు విజయవాడ తూర్పు సీటును అధినేత కట్టబెట్టినట్టు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా పని చేసి ఇటీవల జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ పక్షాన చేసిన యలమంచలి రవి సీటు దక్కకపోవటం ఆయన వర్గాన్ని కొంత నిరాశకు గురి చేసింది.