కృష్ణ

జిల్లాలో 34.34లక్షల మంది ఓటర్ల నమోదు: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): జిల్లాలో ఇప్పటి వరకు 34లక్షల 34వేల 144 మంది ఓటర్లుగా నమోదయ్యారని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో పురుషులు 16లక్షల 92వేల 602 మంది ఉండగా మహిళా ఓటర్లు 17లక్షల 41వేల 273 మంది ఉన్నట్లు తెలిపారు. థర్డ్ జండర్‌కు సంబంధించి 249 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. అత్యధికంగా మైలవరం నియోజకవర్గంలో 2లక్షల 70వేల 974 మంది ఓటర్లు నమోదు కాగా అత్యల్పంగా పెడన నియోజకవర్గంలో లక్షా 64వేల 571 మంది నమోదైనట్లు పేర్కొన్నారు. నూజివీడులో 2లక్షల 26వేల 22 మంది, కైకలూరులో లక్షా 92వేల 582 మంది, గన్నవరంలో 2లక్షల 51వేల 858 మంది, గుడివాడలో 2లక్షల 840 మంది, మచిలీపట్నంలో లక్షా 76వేల 775 మంది, అవనిగడ్డలో 2లక్షల 4వేల 313 మంది, పామర్రులో లక్షా 78వేల 399 మంది, పెనమలూరులో 2లక్షల 59వేల 555 మంది, తిరువూరులో 2లక్షల 600 మంది, విజయవాడ వెస్ట్‌లో 2లక్షల 15వేల 255 మంది, విజయవాడ సెంట్రల్‌లో 2లక్షల 50వేల 955 మంది, విజయవాడ తూర్పులో 2లక్షల 56వేల 111 మంది, నందిగామలో లక్షా 92వేల 185 మంది, జగ్గయ్యపేటలో లక్షా 93వేల 149 మంది ఓటర్లు నమోదైనట్లు కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు.

21 నుండి శ్రీ తిరుపతమ్మ నెలబోణ మహోత్సవాలు
* చిన్న తిరునాళ్ళకు ఏర్పాట్లు సిద్ధం
మైలవరం, మార్చి 18: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోన్న శ్రీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వార్ల నెలబోణ మహోత్సవాలు ఈనెల 21 నుండి 25 వరకూ ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. మండలంలోని చండ్రగూడెం శివారు బొర్రగూడెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వార్ల నెలబోణ మహోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈనెల 19నుండి ఈఉత్సవాలను నిర్వహించారు. అమ్మవారి కల్యాణం అనంతరం నెల రోజులకు వచ్చేది నెలబోణ మహోత్సవాలు. బోణము అనగా పొంగలి నైవేద్యం. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోణము భక్తులు సమర్పించి మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. మైలవరం మండలం నుండే కాక చుట్టుపక్కల మండలాలతోపాటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఐదురోజులపాటు భక్తులు ఇక్కడే ఉండి అమ్మవారికి ప్రతి నిత్యం పూజలు నిర్వహిస్తూ పొంగలి నైవేద్యం సమర్పిస్తూ మొక్కుబడులు చెల్లించి అమ్మవారి సన్నిధిలోనే జాగారం చేస్తారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సి జయప్రకాష్ బాబు తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చెలికాని వెంకట సత్య వర ప్రసాద్ నేతృత్వంలో భక్తులకు వసతితోపాటు తాగునీటిని, ప్రతిరోజూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తుల కాలక్షేపం కోసం ప్రతిరోజూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 21న సత్యహరిశ్ఛంద్ర అనే పౌరాణిక నాటకం, 22న కాకినాడ వారిచే వెరైటీ బుర్రకధ, 23న మైలవరం షిరిడీ సాయి సేవాదళ్ వారిచే శ్రీ షిరిడీ సాయి లీలామృతం, 24న గుడివాడ వారిచే భక్త చింతామణి, 25న విజయవాడ వారిచే భక్తిపాటల కచేరి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి కాక ప్రతిరోజూ పంబల, కొమ్ముల వారిచే అమ్మవారి జీవిత చరిత్రను కధలుగా వినిపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్న తిరునాళ్ళను పురస్కరించుకుని ఆలయాన్ని రంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించినట్లు తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని అమ్మ కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.