కృష్ణ

వ్యయ పరిశీలకులు వచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వ్యయ పరిశీలకులు వచ్చారు. ఎన్నికల్లో ధనం, మద్యం ప్రభావాన్ని నియంత్రణతో పాటు పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని నియంత్రించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలకు సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారులను నియమించింది. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి ఉమా శంకర ప్రసాద్, విజయవాడ పార్లమెంట్‌కు సందీప్ సింగ్, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆదిత్య శుక్లా, మచిలీపట్నం, పెడన అసెంబ్లీ నియోజకవర్గాలకు కె జయ గణేష్, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలకు అన్సారి, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు అరుణ్ కాషప్‌లను నియమించారు. మంగళవారం జిల్లాలో నియమించిన వ్యయ నియంత్రణ బృందాల సభ్యులకు ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠిలను కలెక్టరేట్‌లో కలిశారు. వ్యయ పరిశీలకులతో భేటీ అయిన కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు మండలాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల వ్యయ నియంత్రణ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఇప్పటి వరకు 25వేల పోస్టర్లు, వాల్ రైటింగ్స్, బ్యానర్లు తొలగించడం జరిగిందన్నారు. ఇసి నిబంధనల ప్రకారం ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 1+5 సిబ్బందిని నియమించామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఎదురుమొండి దీవుల్లో ఐదు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సి-విజిల్, 1950 కాల్ సెంటర్ కంట్రోల్ రూమ్‌ను వారు సందర్శించారు. సి-విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, పరిష్కార చర్యలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ ఎ ప్రసాద్, పెడన అసెంబ్లీ నియోజకవర్గ ఆర్‌ఓ, ముడ వీసీ విల్సన్ బాబు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ ఖాజావలీ, డీసీఓ ఆనంద బాబు పాల్గొన్నారు.