కృష్ణ

నామినేషన్ల కోలాహలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో నామినేషన్ల కోలాహలం నెలకొంది. మూడవ రోజైన బుధవారం జిల్లాలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 22 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పార్లమెంట్ స్థానాలకు మూడు, అసెంబ్లీ స్థానాలకు 19 నామినేషన్లు వచ్చాయి. పార్లమెంట్ స్థానాలకు ప్రధాన పార్టీల నుండి నామినేషన్లు దాఖలు కాకపోయినప్పటికీ పలు అసెంబ్లీ స్థానాలకు ప్రధాన పార్టీల నుండి అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. ఎక్కువగా అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ఒక్క గుడివాడలో మాత్రమే వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) దాఖలు చేశారు. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య నామినేషన్లు వేశారు. నామినేషన్ల సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. అభ్యర్థులు నామినేషన్ల రూపేణా తమ బల ప్రదర్శనను చూపారు. వేలాది మంది కార్యకర్తలతో ఊరేగింపులు నిర్వహించి నామినేషన్లు వేశారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పేరం శివ నాగేశ్వరరావు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ పార్లమెంట్ స్థానానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పడాల శివ ప్రసాద్ ఒక నామినేషన్ వేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ రెండు సెట్లు, వల్లభనేని పంకజశ్రీ ఒక నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహనరావు రెండు సెట్లు, గద్దె క్రాంతి కుమార్ టీడీపీ అభ్యర్థిగా ఒక నామినేషన్ వేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వరరావు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. నందిగామ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య ఒక నామినేషన్ దాఖలు చేశారు. గుడివాడ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) ఒకటి, కొడాలి నాగేశ్వరరావు మరో నామినేషన్ వేశారు. కైకలూరు నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శొంఠి కుమార స్వామి ఒకటి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గుంటబాల ప్రసూనాంబ ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థినిగా శొంఠి నాంచారమ్మ ఒక నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఉంగర వెంకట నాంచారయ్య ఒక నామినేషన్ వేశారు. పామర్రు నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బడుగు క్రాంతి కుమార్ ఒకటి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పొందుగుల వెంకట రెడ్డి ఒకటి, రత్నావతి హరిత మరో నామినేషన్ వేశారు. మైలవరం నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గుడివాడ నాగరాజు ఒక నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా గత మూడు రోజులుగా చూస్తే జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు మూడు, 10 అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి.