కృష్ణ

పట్ట్భద్రుడి ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికకు సంబంధించి పోలింగ్ నేడు జరగనుంది. రెండు జిల్లాల పరిధిలో జరిగే ఈ ఎన్నికకు ఆయా జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ నుండి ప్రశాంత వాతావరణంలో ఎన్నిక నిర్వహణకు జిల్లా కలెక్టరు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 40 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల నుండి అభ్యర్థులు లేకపోవడం విశేషం. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన కెఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచారు. మిగిలిన వారు స్వతంత్య్ర అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు జిల్లాలకు సంబంధించి మొత్తం 2లక్షల 48వేల 799 మంది ఓటర్లు నమోదు కాగా కృష్ణాజిల్లాకు సంబంధించి లక్షా 6వేల 829 మంది పట్ట్భద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగే ఈ ఎన్నికలో ప్రతి ఒక్క పట్ట్భద్రుడు బరిలో నిలిచిన ఐదుగురికి మాత్రమే ప్రాధాన్యత ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల విషయానికొస్తే రెండు జిల్లాల్లో 362 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలో 153 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1+3 కింద ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికార్ల నియామకం జరిగింది. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్‌లకు సంబంధించి 21 మంది సెక్టార్ ఆఫీసర్లు, 26 రూట్ ఆఫీసర్లను నియమించారు. మొత్తం 600 బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులో ఉంచారు.