కృష్ణ

అట్టహాసంగా ‘కొల్లు’ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి గాను సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. రవీంద్ర నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. పుర వీధులన్నీ పసుపు మయమయ్యాయి. కోనేరుసెంటరు నుండి లక్ష్మీటాకీసు సెంటరు వరకు సుమారు రెండు మూడు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి జన సంద్రంగా మారింది. సిట్టింగ్ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావుతో కలిసి ఆయన భారీ ర్యాలీగా కలెక్టరేట్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వచ్చారు. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావుకు రవీంద్ర నామినేషన్ పత్రాలను అందచేశారు. రవీంద్ర, ఆయన సతీమణి నీలిమ ఇద్దరూ నాలుగు సెట్లు చొప్పున నామినేషన్‌లు వేశారు. నామినేషన్ దాఖలుకు ముందు మంత్రి రవీంద్ర తన నివాసంలో గో పూజ నిర్వహించారు. నామినేషన్ దాఖలు అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా తెలుగుదేశం పార్టీ పక్షానే ఉన్నారన్నారు. గత ఐదేళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మళ్లీ తమకు అధికారాన్ని ఇస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రజలను మాయ చేయాలని చూస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.