కృష్ణ

కోలాహలంగా ఉమ, కేపీ నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: తెలుగుదేశం పార్టీ మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌లు గురువారం కోలాహలంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తమతమ నామినేషన్లను దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకే బిజెపి అభ్యర్థి నూతలపాటి బాల కోటేశ్వరరావు నామినేషన్ పత్రాన్ని నియోజకవర్గ ఎన్నికల అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌ఏ సలాంకు అందించారు. మధ్యాహ్నం 1.08 గంటలకు వైకాపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి సలాంకు అందించారు. అంతకుముందు వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష కృష్ణ ప్రసాద్‌కు డమీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిరువురూ నామినేషన్ పత్రాలను దాఖలు చేసి బయటికి వచ్చిన అనంతరం తెలుగుదేశం అభ్యర్థి, మంత్రి దేవినేని ఉమ తన తండ్రి శ్రీమన్నారాయణ, అనుచరులతో కలసి వచ్చి 1.35 గంటలకు తన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి సలాంకు అందించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి తమ నేతలకు సంఘీభావం ప్రకటించారు. ఇరు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇంచుమించు ఒకే సమయం అవటం, కార్యకర్తలు వేలాది మంది తరలి రావటంతో వారిని అదుపు చేయలేక పోలీసులు నానా తంటాలు పడ్డారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొర్రా కిరణ్ తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి సలాంకు అందించారు. నాలుగు జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లను దాఖలు చేయటంతో మైలవరం పట్టణం జనంతో కిక్కిరిసి పోయింది. తెలుగుదేశం, వైకాపాలకు చెందిన కార్యకర్తలు మైలవరం ప్రధాన వీధులలో బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. కేపీ నామినేషన్లు దాఖలు చేసి బయటికి వెళ్ళే వరకూ టీడీపీ వారిని ఆ ప్రాంతానికి కూడా పోలీసులు రానీయలేదు. కేపీ నామినేషన్లు వేసి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ ర్యాలీ కదలటానికి అనుమతి ఇచ్చారు.

ప్రజల ఆదరాభిమానాలే
గెలుపునకు దోహదం

ఎ కొండూరు, మార్చి 21: తిరువూరు నియోజకవర్గ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్ధానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గురువారం మధ్యాహ్నాం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి కె ఝాన్సీలక్ష్మికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గతంలో మునుపెన్నడులేని విధంగా కనివిని ఎరుగని రీతిలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు నియోజకవర్గ నాలుగు మండలాల నుండి టీడీపీ జెండాలను చేతబూని ద్విచక్ర వాహనాలు భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివెళ్ళారు. మంత్రి జవహర్ స్వగ్రామమైన గానుగపాడు నుండి భార్య కుమార్తెల ఆశీస్సులు, హారతులు అందుకుని ర్యాలీతో ఊరేగింపుగా బయలుదేరి పల్లెర్లమూడి, కోడూరు, గోపాలపురం, కాకర్ల, లక్ష్మిపురం గ్రామాల మీదుగా తిరువూరు తహశీల్దార్ కార్యాలయానికి తరలివెళ్ళారు. ఆయన వెంట విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో దారి పొడవునా అసంఖ్యాకంగా ప్రజలు మండు టెండను సైతం లెక్కచేయకుండా అడుగడుగునా ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తన పట్ల చూపిన ఆదరాభిమానాలే తన గెలుపుకు సోపానాలన్నారు. రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు ఒక్క టీడీపీతోనే సాధ్యపడుతుందన్నారు. తాను సుమారు 25వేల ఓట్ల అధిక్యతతో గెలిచి కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో తిరువూరు ఎఎంసీ చైర్మన్ అలవాల రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ తాళ్ళూరి రామారావు పాల్గొన్నారు.