కృష్ణ

నామినేషన్ల జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో నామినేషన్ల జోరు ఊపందుకుంది. గత రెండు రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణలో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు, పెడన మినహా మిగిలిన 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 79 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల రూపంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల తమ బలాబలాను ప్రదర్శించారు. వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్ల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు నామినేషన్లు, విజయవాడ పార్లమెంట్‌కు ఒక నామినేషన్ దాఖలైంది. మచిలీపట్నం పార్లమెంట్‌కు బీజేపీ అభ్యర్థిగా గుడివాక అంజిబాబు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ధనేకుల గాంధి, విజయవాడ పార్లమెంట్‌కు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా మాదాబత్తుల చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థులుగా మంత్రి కొల్లు రవీంద్ర, కొల్లు నీలిమ, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా వాడపల్లి రఘునాధ్ నామినేషన్ దాఖలు చేశారు. తిరువూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్, వైసీపీ అభ్యర్థిగా కొక్కిలిగడ్డ రక్షణనిధి నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్‌గా కళ్లేపల్లి తులశమ్మ, ఆల్ ఇండియా ప్రజాపార్టీ అభ్యర్థిగా చింతాబత్తిన జేమ్స్ బాబూరావు నామినేషన్ వేశారు. నూజివీడు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నామినేషన్ వేశారు. గన్నవరం నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థులుగా యార్లగడ్డ వెంకట్రావ్, యార్లగడ్డ జ్ఞానేశ్వరి, పరమిడ్ పార్టీ అభ్యర్థిగా చాగంటిపాటి గంగాధర్ గాంధి నామినేషన్ దాఖలు చేశారు. గుడివాడ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థులుగా దేవినేని అవినాష్, వేమూరి బసవ కుటుంబరావు నామినేషన్లు వేశారు. కైకలూరు నియోజకవర్గానికి ఇండిపెండెంట్లుగా కొల్లిపర కృష్ణనాగరాజు, గొంతుపులుగు సతీష్ కుమార్ నామినేషన్ వేశారు. అవనిగడ్డ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వైసీపీ అభ్యర్థులుగా సింహాద్రి రమేష్‌బాబు, సింహాద్రి వికాస్, జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి కృష్ణారావు, ఇండిపెండెంట్‌గా ముత్తంశెట్టి విజయ నిర్మల, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా కంఠంనేని రవి శంకర్ నామినేషన్ దాఖలు చేశారు. పామర్రు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, వైసీపీ అభ్యర్థులుగా కైలే అనీల్ కుమార్, కైల జ్ఞానమణి, మొవ్వ మోహనరావు నామినేషన్‌లు వేశారు. పెనమలూరు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథి నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నాగెండ్ల దేవసహాయం, ఇండిపెండెంట్‌గా కొనుము శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్‌కు వైసీపీ అభ్యర్థిగా మల్లాది విష్ణు, బీజేపీ అభ్యర్థిగా సత్యమూర్తి రామరాజు, సీపీఎం అభ్యర్థిగా చిగురుపాటి బాబూరావు, జనవాహిణి అభ్యర్థిగా శ్రీనివాస నాగేశ్వర వర ప్రసాద్ బాబు, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థులుగా బొప్పన భవకుమార్, గాధిరెడ్డి పూర్ణచంద్రరావు, జనసేన అభ్యర్థులు బత్తిన రామ్మోహనరావు, బత్తిన శివ కుమార్, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా చెరుకూరి పవన్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థిగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, వసంత శిరీష, బీజేపీ అభ్యర్థిగా నూతలపాటి బాలకోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొర్రా కిరణ్ కుమార్ నామినేషన్‌లు దాఖలు చేశారు. నందిగామ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా గతంలో నామినేషన్ వేసిన తంగిరాల సౌమ్య మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జగ్గయ్యపేటకు టీడీపీ అభ్యర్థులుగా శ్రీరామ్ రాజగోపాల్, శ్రీదేవి శ్రీరామ్ నామినేషన్లు వేశారు.