కృష్ణ

ప్రజల దీవెనలతో హ్యాట్రిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : ప్రజల దీవెనలతో హ్యాట్రిక్ సాధిస్తానని ఎంపి కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా శుక్రవారం ఆయన మూడు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌కు అందచేశారు. కొనకళ్లతో పాటు ఆయన కుమారుడు గణపతి కూడా డమీగా రెండు నామినేషన్లు వేశారు. గత రెండు పర్యాయాలుగా పార్లమెంట్ సభ్యుడిగా తనను ఆదరించిన ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గ పరిధిలోని మరికొన్ని కీలక సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను అన్ని విధాలా అభివృద్ధి పర్చనున్నట్లు తెలిపారు. కొనకళ్ల నామినేషన్ కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి వేలాది మంది పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలి వచ్చారు. సుల్తానగరంలోని శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, తీన్ మార్ నడుమ నారాయణరావు ఊరేగింపుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ తదితరులు కొనకళ్ల నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.